కటకటాల వెనక్కి ప్రేయసిని చంపిన ఎంబిఎ గ్రాడ్యుయేట్
మైసూరు: ప్రేయసిని చంపిన ఎంబిఎ గ్రాడ్యుయేట్‌ను కర్ణాటర రాష్ట్రం మైసూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మూడు వారాల క్రితం జరిగిన ఓ హత్య కేసును వారు ఛేదించారు. సంఘటనా స్థలంలోని ఐదు ఖాళీ మద్యం సీసాలు, సిసిటివీ ఫుటేజీ, కాల్ రికార్డు వివరాలు 20 ఏళ్ల హత్య కేసును ఛేదించేందుకు ఉపయోగపడ్డాయి.
తన ప్రేయసిని చంపినందుకు అతని సొంత పట్టణంలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మహిళ సగం కాలిన మృతదేహం డిసెంబర్ 22వ తేదీన పశ్చిమ మైసూరులోని ఆర్టీ నగర్‌లో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మ్యాన్‌హోల్‌లో కనిపించింది.

మహిళపై దాడి చేసి, ఆమెను చంపి, శవాన్ని కాల్చి మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం పూట జాగింగ్ చేసేవారు ఆ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హత్య మిస్టరీగానే మారింది. అయితే, నిందితుడిని అరెస్టు చేసేవరకు పోలీసులు దాని అంతు చిక్కలేదు.
ఖాళీ మద్యం సీసాలు, కాల్ వివరాల ఆధారంగా చామరాజ్‌నగర్ జిల్లాలోని కొల్లెగల్ తాలూకా దొడ్డహిందువాడిలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని వాటిపై లేబుల్స్ ఆధారంగా వాటిని విక్రయించిన దుకాణాన్ని కనిపెట్టి ఆరా తీశారు. ఆ బాటిల్స్‌ను కొన్న వ్యక్తిని గుర్తించడానికి సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
చిత్రం దొరిగినప్పటికీ అతను ఎవరనేది గుర్తించడం పోలీసులకు కష్టంగానే మారింది. అయితే, అదృష్టవశాత్తు నేరం జరిగిన స్థలానికి 21,22 మధ్య రాత్రి వెళ్తున్న కారు ఫుటేజీ పోలీసులకు చిక్కింది. ఓ ప్రైవేట్ నివాసం వద్ద అమర్చిన ఉన్న సిసిటీవీ కెమెరా ఫుటేజీ దాన్ని పట్టించింది. ఈ ఇమేజ్ స్పష్టంగా లేనప్పటికీ నేరం జరిగిన తీరును మాత్రం పట్టిచ్చింది. ఆ తర్వాత దాదాపు 200 మొబైళ్ల నుంచి 20-25 మొబైల్ నెంబర్లను షార్ట్ లిస్ట్ చేసి నిందితుడిని గుర్తించారు.












Click it and Unblock the Notifications