వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16రోజులపాటు ఒకే నూనె: ‘మెక్‌డొనాల్డ్స్‌’కు నోటీసులు

|
Google Oneindia TeluguNews

జైపూర్: దేశంలోని పలు నగరాల్లో వెస్ట్రన్ ఫుడ్ రెస్టారెంట్ చైన్‌ను నిర్వహిస్తున్న మెక్‌డొనాల్డ్‌లో 16రోజులపాటు వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ వాడుతుండటం ఆ సంస్థకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాజస్థాన్ ఆరోగ్య విభాగం 'మెక్‌డొనాల్డ్స్'నోటీసులు పంపింది.
సాధారణ పర్యవేక్షణలో భాగంగా జైపూర్‌లోని మెక్‌డొనాల్డ్స్ ఔట్ లెట్లలో తనిఖీలు నిర్వహించగా.. ఈ విషయం బహిర్గతమైందని అధికారులు తెలిపారు.
జూన్ 17న తాము తనిఖీలు నిర్వహించామని, పాంచ్ బట్టి ప్రాంతంలోని మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న రెస్టారెంట్లో వాడేసిన నూనెనే వాడుతూ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని గుర్తించినట్లు తెలిపారు.

McDonald's Served Notice for Using 16-Day Old Oil, Unfit for Consumption

ఆ నూనెలో ఎంతమాత్రమూ నాణ్యత లేదని జూన్ 1 నుంచి అదే ఆయిల్ వాడుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని వివరించారు. డీప్ ఫ్రై చేస్తున్న వంట నూనెల్లో పోషకాలేవీ ఉండవని, ఇక అదే ఆయిల్‌ను నిత్యమూ వాడితే క్యాన్సర్ కారక పోలీసైకిల్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్లు పెద్దఎత్తున పెరుగుతాయని రాజస్థాన్ క్యాన్సర్ ఫౌండేషన్ చీఫ్ డాక్టర్ రాకేష్ గుప్తా తెలిపారు.

'అధిక ఉష్ణోగ్రతల వద్ద టాక్సిస్ ఆల్డిహైడ్స్ పుట్టుకొస్తాయి. ఈ ఆయిల్ వాడితే, క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు గుండెజబ్బులు రావచ్చు. అలాగే, గర్భవతులకు ఇది ప్రమాదం' అని తెలిపారు.

ఈ విషయంలో మెక్ డొనాల్డ్స్ స్పందన కోరగా నేరుగా.. తాము అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన నూనెనే వాడుతున్నామని తెలిపింది. 'ఇండియాలో నూనెల వాడకంపై ఎలాంటి నిబంధనలూ లేవు. కానీ, మేము అన్ని స్టాండర్డ్స్ తో, క్వాలిటీతో ఉన్న నూనెలనే వాడుతాము. గత 60 ఏళ్లుగా 130 దేశాల్లో సేవలందిస్తున్నాం' అని పేర్కొంది. కాగా, నూనె శాంపిల్స్‌ను ల్యాబోరేటరీకి పంపారు. మాన ఆరోగ్యానికి హాని చేస్తాయని తేలితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

English summary
When the Jaipur health department inspected various food chains for quality check earlier this month, three outlets of a leading International fast food brand were found to have been re-using 16 days old oil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X