Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా సైనికచర్యపై భారత్ హైఅలర్ట్

వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంజా విసిరారు. వైమానిక దాడులతో విరుచుకుపడ్డారు. రాజధాని కారకాస్ పై బాంబులను కురిపించారు. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించారు. అక్రమ మాదక ద్రవ్యాలను తమ దేశంలోకి పంపిస్తోందనే ఆరోపణలపై అమెరికా ఈ సైనిక చర్యకు ఒడిగట్టింది. ఇదే అంశంపై మదురోను విచారించబోతున్నట్లు ప్రకటించింది. న్యూయార్క్ వేదికగా ఈ న్యాయ విచారణ కొనసాగుతుంది.

ఈ పరిణామాలపై భారత్ అలర్ట్ అయింది. వెనిజులాలో నివసించే పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలను మానుకోవడం లేదా వాయిదా వేసకోవాలని కోరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఇక్కడ భారతీయులందరూ కారకాస్‌లోని రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని పేర్కొంది.

MEA Urges Indians in Venezuela to Stay Indoors and Stay Connected with Caracas Embassy

పరిస్థితులు చేయి దాటుతున్నాయని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సంచారాన్ని నియంత్రించుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఈమెయిల్ ([email protected]), అత్యవసర ఫోన్ నంబర్ (+58-412-9584288), వాట్సాప్ సర్వీసులతో సహా రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు అయ్యాయి. వెనిజులాలో నెలకొన్న అనిశ్చిత, ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి వివరించింది.

తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ వెనిజులాలోని భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, తమను నిరంతరం సంప్రదిస్తూ ఉండాలని సూచించింది. వ్యాపారం, ఇతర వ్యక్తిగత పనులపై వెనిజులాకు వెళ్లిన భారతీయులు కూడా వెంటనే స్వదేశానికి తిరిగి రావలని కోరింి. భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ఇళ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని, సహాయం కోసం ఎంబసీని నిరంతరం సంప్రదింపులు జరపాలని కోరారు.

అటు ఐక్యరాజ్య సమితి సైతం రంగంలోకి దిగింది. ఈ దాడి అంశాన్ని చర్చించడానికి సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతమండలి అత్యవసరంగా సమావేశం కాబోతోంది. వెనిజులాపై అమెరికా చేపట్టిన సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ తలెత్తిన ఉద్రిక్తతల గురించి భద్రతమండలి చర్చించబోతోంది. ఇదే ప్రధాన అజెండా కూడా. వెనిజులాపై దాడి, ఆ తర్వాతి పరిణామాలపై చర్చించడానికి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+