Crime News: నడి రోడ్డుపై నగ్నంగా యువతి.. గ్యాంగ్ రేపు కేసులో ఊహించని ట్విస్ట్..
దేశంలో సంచలన సృష్టించిన ఓ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. యూపీలో కొద్ది రోజుల క్రితం ఓ యువతి నగ్నంగా నడిరోడ్డుపై నిస్సహా స్థితిలో నడుచుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ కూడా చేశారు.అసలు యువతిపై అత్యాచారం జరగలేదని, వైద్య పరీక్షలోనూ అది నిర్ధారణ అయిందని వెల్లడించారు.
సెప్టెంబర్ 1న మోరాదాబాద్ లో నగ్నంగా ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఉంది తన కుటుంబానికి చెందిన యువతి అని సెప్టెంబర్ 7న ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్తస్రావంతో ఆమె ఇంటికి చేరిందని, ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగిందని వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ ఐదుగురిని అరెస్ట్ చేశారు.













Click it and Unblock the Notifications