సెల్యూట్ మేడమ్: బెంగళూరులో భర్త పేరు కోసం రూ. 300 కోట్ల ఆస్తి దానం చేసిన మహిళ, చిన్నారులు !
బెంగళూరు: బెంగళూరు నగరంలో వ్యాపారాలకు, సినీ పరిశ్రమకు కేంద్ర బింధువు అయిన మెజస్టిక్ సమీపంలోని రూ. 300 కోట్ల విలువైన ఆస్తిని పేద పిల్లల కోసం దానం చేస్తున్నామని ఆ ఆస్తి యజమాని ప్రకటించారు. కన్నడ కంఠీరవుడు పద్మభూషణ్ డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ విష్ణువర్దన్ లకు ఎంతో ఇష్టం అయిన లక్ష్మీ హోటల్ ఇక ముందు పేదల పిల్లల ఆరోగ్య కేంద్రంగా మార్చుతున్నామని దాని యజమాని మీరా నాయుడు తెలిపారు. తన భర్త పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఈ ఆస్తిని దానం చేస్తున్నామని మీరా నాయుడు అన్నారు. మీరా నాయుడు పేదల కోసం త్యాగం చెయ్యడంతో ఆమెకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

స్యాండిల్ వుడ్ హబ్
బెంగళూరు నగరంలోని మెజస్టిక్ కు కూతవేటు దూరంలో గాంధీనగర్ ఉంది. గాంధీనగర్ లో సుమారు 99 శాతం వాణిజ్య కట్టడాలే ఉన్నాయి. స్యాండిల్ వుడ్ (కన్నడ సినీ పరిశ్రమ)కు గాంధీనగర్ కేంద్ర బింధువు. ఇక్కడి నుంచే కన్నడ సినిమాలతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ తదితర సినిమాల లావాదేవీలు జరుగుతుంటాయి.

లక్ష్మీ హోటల్ అంటే !
గాంధీనగర్ లో పేరుపొందిన లక్ష్మీ హోటల్ ఉంది. ఈ హోటల్ కు ప్రముఖ సినీ తారలు వచ్చి వెలుతుంటారు. ఇదే లక్ష్మీ హోటల్ లో చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు బస చేస్తుంటారు. లక్ష్మీ హోటల్ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 300 కోట్లకు పైగా విలువ చేస్తోంది.

లక్ష్మీ హోటల్ కోసం పోటీ !
లక్ష్మీ హోటల్ కొనుగోలు చేసి అక్కడ విశాలమైన స్టార్ హోటల్ నిర్మించాలని అనేక మంది వ్యాపారవేత్తలు పోటీ పడ్డాడు. అయితే లక్ష్మీ హోటల్ యజమాని మీరా నాయుడు మాత్రం ఆ హోటల్ ను విక్రయించడానికి నిరాకరించారు. పేద పిల్లల కోసం ఏదో ఒకటి చెయ్యాలని మీరా నాయుడు నిర్ణయించారు.

భర్త పేరుకు గుర్తుగా రూ. 300 కోట్ల ఆస్తి దానం
తన భర్త శ్రీనివాసులు నాయుడు ఎంతో కష్టపడి మూడు అంతస్తుల్లో 32 గదులతో లక్ష్మీ హోటల్ నిర్మించారని, ఆయనకు గుర్తుగా ఆ హోటల్ ను తాను క్యాన్సర్ చికిత్స కోసం బెంగళూరుకు వచ్చే గ్రామీణ పేద పిల్లలు బస చెయ్యడానికి రూ. 300 కోట్ల విలువైన ఈ ఆస్తిని దానం చెయ్యాలని నిర్ణయించానని మీరా నాయుడు తెలిపారు.

క్యాన్సర్ చికిత్స చిన్నారుల కోసం !
గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు వారి పిల్లల క్యాన్సర్ చికిత్స కోసం బెంగళూరు వస్తున్నారని, చాలా రోజులు ఇక్కడే లాడ్జ్ లు, హోటల్స్ లో వారు బస చేసి చికిత్స చేయించుకుంటున్నారని మీరా నాయుడు గుర్తు చేశారు. అలాంటి పేద పిల్లలు, వారి కుటుంబ సభ్యులు ఉచితంగా ఇక్కడ బస చెయ్యడానికి రూ. 300 కోట్ల విలువైన లక్ష్మీ హోటల్ దానం చేస్తున్నామని మీరా నాయుడు ప్రకటించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications