ఆ.. నలుగురే కీలకం: ఈశాన్యంలో దూసుకెళ్తున్న కమలం

న్యూఢిల్లీ: ఈశాన్యరాష్ట్రాల్లో 2014కు ముందు బీజేపీ జెండా పట్టుకునే వారే లేరు. 10 - 15 ఏళ్లుగా ఆరెస్సెస్‌ తీవ్రంగా శ్రమిస్తున్నా రాజకీయంగా బీజేపీకి వార్డు మెంబర్లు కూడా లేని పరిస్థితి. కానీ కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడున్నరేళ్లలో పరిస్థితి చాలా మారింది. ఆరెస్సెస్‌ క్షేత్రస్థాయి పనికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు తోడవటంతో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేసే స్థాయికి ఎదిగింది. పరిస్థితులకు భిన్నంగా ఎంతోకాలంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఈశాన్య ప్రాంతంలో చేస్తున్న క్రుషి ఇప్పటికి సాకారమైంది.
అసొంలో అధికారంతో మొదలైన బీజేపీ 'ఈశాన్య' పయనం త్రిపుర విజయంతో మరింత విశ్వాసంగా ముందుకెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. త్రిపురలో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టడం, నాగాలాండ్‌లోనూ బీజేపీకి విజయాన్ని అందించటంలో నలుగురు నేతలు అన్నింటా తామై వ్యవహరించారు. వారే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అస్సాం మంత్రి, బీజేపీ ఈశాన్య రాష్ట్రాల బాధ్యుడు హిమంత బిశ్వాశర్మ, త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్‌ కుమార్‌ దేవ్, ఆరెస్సెస్‌ వ్యూహకర్త సునీల్‌ డియోధర్‌.

అసోం నుంచి మణిపూర్ వరకు.. ఆ పై త్రిపుర.. నాగాలాండ్‌లో ఇలా హిమంత్

అసోం నుంచి మణిపూర్ వరకు.. ఆ పై త్రిపుర.. నాగాలాండ్‌లో ఇలా హిమంత్

2015లో బీజేపీలో చేరకముందు ఈయన కాంగ్రెస్‌ నేత. దశాబ్దానికి పైగా అస్సాం కాంగ్రెస్‌కు సేవలందించారు. అప్పటి సీఎం తరుణ్‌ గొగోయ్‌తో భేదాభిప్రాయాలతో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఈయన సామర్థ్యాన్ని గుర్తించిన బీజేపీ.. పార్టీలోకి వస్తూనే 2015 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన వ్యూహకర్తగా అవకాశాన్నిచ్చింది. పలువురు బీజేపీ కేంద్ర నాయకులతో కలిసి బిశ్వాశర్మ రూపొందించిన వ్యూహాలు.. గొగోయ్‌ కోటను బద్దలు కొట్టి బీజేపీకి పట్టంగట్టాయి. ఈశాన్య రాష్ట్రాలపై మంచి అవగాహన ఉన్న హిమంతకు ఆ తర్వాత నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర పగ్గాలను పార్టీ అప్పగించింది. అవతలి పార్టీల నేతలను చేరుకుని కూటములు ఏర్పాటు చేయటం, బీజేపీలోకి ఆహ్వానించటంలో శర్మ రూటే ప్రత్యేకం. వనరులను సృష్టించటంలోనూ ఈయన అందెవేసిన చేయి. త్రిపురలో ఐపీఎఫ్‌టీతో, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో పొత్తుల విషయంలో హిమంత కీలకంగా వ్యవహరించారు.

మూడున్నరేళ్లుగా త్రిపురలో బీజేపీ ప్రచార వ్యూహ రచనలో కీలకం

మూడున్నరేళ్లుగా త్రిపురలో బీజేపీ ప్రచార వ్యూహ రచనలో కీలకం

ఆరెస్సెస్‌ ముఖ్య నేత సునీల్ డియోధర్ పదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లో సంఘ్‌ ప్రభావం పెంచటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే సునీల్ డియోధర్‌ను.. అమిత్‌ షా త్రిపుర ప్రధాన వ్యూహకర్తగా నియమించారు. అదీ ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే. బీజేపీ ఇంటింటి ప్రచారం విజయవంతం కావటంలో ఈయన పాత్ర అత్యంత కీలకం. పదేళ్లపాటు మేఘాలయలో ఆరెస్సెస్ విస్తరణ కోసం పని చేసిన సునీల్ డియోధర్.. తొలుత 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.. అంతకుముందు వారణాసిలో ప్రధాని మోదీకి ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్రలో సీపీఎం పోటీ చేసిన పాల్ఘార్ స్థానంలో బీజేపీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ డియోధర్.. బీజేపీ జాతీయ నాయకత్వం ద్రుష్టిని ఆకర్షించారు. నాటి నుంచి త్రిపురలో పార్టీని అన్ని విధాల పార్టీని సన్నద్ధం చేశారు.

2016 నుంచి త్రిపురలో బీజేపీ విస్తరణకు సారథ్యం

2016 నుంచి త్రిపురలో బీజేపీ విస్తరణకు సారథ్యం

బీజేపీ త్రిపుర సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ అభ్యర్థి రేసులో ముందువరసలో ఉన్నారు. బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు. మాజీ ఆరెస్సెస్‌ ప్రచారక్‌ కూడా. సీఎం అభ్యర్థిగా ప్రకటించకున్నా.. బీజేపీ ఈయన్నే ముందుండి ప్రచారాన్ని నడిపించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుదీప్‌రాయ్‌ బర్మన్‌ సహా పలువురు ముఖ్యమైన కాంగ్రెస్‌ నేతలను బీజేపీలో చేర్చటంలో కీలకంగా వ్యవహరించారు. 15 ఏళ్ల క్రితం విద్యా ఉపాధి కోసం ఢిల్లీకి వెళ్లిన విప్లవ్ కుమార్‌దేవ్ ‘జిమ్'లో శిక్షకుడిగా పని చేశారు. తొలి నుంచి ఆరెస్సెస్‌తో అనుబంధం కలిగి ఉన్న విప్లవ్ కుమార్ దేవ్‌ను 2016లో బీజేపీ కేంద్ర నాయకత్వం తిరిగి త్రిపురకు పంపింది.

మణిపూర్, నాగాలాండ్‌ల్లో హిమంత్‌తో కలిసి ఇలా రాం మాధవ్

మణిపూర్, నాగాలాండ్‌ల్లో హిమంత్‌తో కలిసి ఇలా రాం మాధవ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. జమ్మూకశ్మీర్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీ కూటములు ఏర్పాటుచేయటంలో రామ్‌ మాధవ్‌ అసలైన వ్యూహకర్త. చాలా ఓపికగా వ్యవహరించటం. వ్యూహాలు రచించటంలో దిట్ట. నాగాలాండ్‌లో ఎన్డీపీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంలోనూ హిమంత బిశ్వ శర్మతో కలిసి పనిచేశారు. గతేడాది మణిపూర్ రాష్ట్రంలో స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. అంతకుముందు 2015లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పొత్తు పెట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+