అజిత్ ఎంట్రీ కలకలం: ఏక్‌నాథ్ షిండే ఇంట్లో అత్యవసర భేటీ, సీఎం రాజీనామాపై తేల్చేశారు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరడం షిండే శివసేనలో కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలోకి అజిత్ ఎంట్రీని షిండే శివసేనలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. మరోవైపు, షిండే సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీఎం ఏక్‌నాథ్ షిండే ముంబైలోని తన నివాసం వర్షాలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో అత్యవసర భేటీ అయ్యారు. అజిత్ పవార్ తోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంపై కీలకంగా చర్చించారు. సీఎం పదవికి రాజీనామా అంటూ వస్తున్న వార్తలపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

అయితే, ఈ అత్యవసర భేటీ ముగిసిన తర్వాత షిండే వర్గం మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయి మాట్లాడుతూ రాజీనామా అంశంపై స్పందించారు. దాదాపు 200 మంది ఎమ్మెల్యే మద్దతును తాము కలిగి ఉన్నామని.. అలాంటప్పుడు సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే ఎందుకు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంపై ఏ నేత కూడా అసంతృప్తితో లేరని స్పష్టం చేశారు.
మరో మంత్రి ఉదయ్ సామంత్ మాట్లాడుతూ.. తాజా భేటీలో వచ్చే లోక్‌సభ, విధానసభ సమావేశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ పనిలో ఎలా ముందుకు సాగాలనేదానిపై చర్చించినట్లు వెల్లడించారు. అజిత్ పవార్ తమ ప్రభుత్వంలో చేరడంపై ఎవరికీ అసంతృప్తి లేదని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలంతా షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతారని చెప్పారు.
#WATCH | Mumbai: Maharashtra Minister Uday Samant after Shiv Sena leaders meeting with Eknath Shinde concludes at Varsha bungalow, says, "Under the leadership of CM Eknath Shinde, there was a meeting regarding upcoming session of the Lok Sabha, the session of Maharashtra… pic.twitter.com/lBpRwcnDTq
— ANI (@ANI) July 5, 2023
కాగా, అంతకుముందు శివసేన ఎంపీ గజానణ్ కీర్తికార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ తోపాటు ఆయనతోపాటు వచ్చిన ఎమ్మెల్యేలకు పదవులు లభించడంతో ఇటు బీజేపీ, అటు శివసేన నుంచి పదవులు ఆశిస్తున్న నేతల్లో అసంతృప్తి నెలకొందని చెప్పారు. ఆ నేతల గురించి షిండే ఆలోచించాలని సూచించారు. బాలాసాహెబ్ థాక్రే కూడా ఎన్సీపీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని కొందరు ఎమ్మెల్యే చెబుతున్నారు.
#WATCH | Mumbai: There is no question of the resignation of CM Eknath Shinde. We have the support of more than 200 MLAs. No leader is unhappy and all have faith in Eknath Shinde's leadership, says Maharashtra Minister Shambhuraj Desai pic.twitter.com/Zpsg77UwHB
— ANI (@ANI) July 5, 2023
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. తమదే నిజమైన ఎన్సీపీ అంటూ అజిత్ ప్రకటించారు. శరద్ పవార్ కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ శిబిరంలోనే ఉండటం గమనార్హం. శరద్ పవార్ శిబిరంలో 17 మంది ఎమ్మెల్యేలుంటే.. అజిత్ పవార్ క్యాంపులో 30 మందికిపైగా ఎమ్మెల్యేలున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications