"అందుకే బస్సు కండక్టర్ తో పారిపోయా".. ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన యూట్యూబర్ భార్య

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనల్లో ఒకటి బస్సు కండక్టర్ తో ఫేమస్ యూట్యూబర్ అఖిల్ భార్య మేఘా నైర్ లేచిపోవడం.. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అఖిల్- మేఘా జంట కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి సోషల్ మీడియాలో దాదాపు 5 లక్షల మందికిపైగా ఫాలోవర్స్, అభిమానులు ఉన్నారు. తమ జీవితంలోని ప్రతి విషయాన్ని, సంతోషాన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకున్నారు. వీరిద్దరూ చేసే కామెడీ రీల్స్ కు లక్షల్లో వ్యూస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకే సంఘటనతో ఈ దంపతుల జీవితం మలుపు తిరిగింది. మేఘా ఇటీవల అర్ధరాత్రి అనూప్ అనే బస్సు కండక్టర్ తో పారిపోయింది.

అయితే మేఘా ఇలా ఎందుకు చేసిందో మొదట్లో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమెను దూషించడం మొదలు పెట్టారు. ఇక ఇదే విషయంపై యూట్యూబర్ అఖిల్ మాట్లాడుతూ.. తన దారి తాను చూసుకుందని.. తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నాడు. అయితే ఇటీవలికాలంలో అఖిల్.. మేఘాతో తరచుగా గొడవలు పెట్టుకోవడం.. చీటికిమాటికి దూషించడం చేసేవాడట. అదే క్రమంలో అనూప్ అనే బస్సు కండక్టర్ ఆమెతో చనువుగా ఉంటూ ప్రేమను చూపించేవాడని టాక్. అందుకే ఆమె కండక్టర్ అనూప్ కు దగ్గరై ఓ రాత్రి అతడితో పారిపోయింది. ఇందకు సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి.

ఇక అనూప్ తో వెళ్లిపోయిన తర్వాత మేఘా ఓ పోస్టు పెట్టింది. అఖిల్ తనను సరిగ్గా చూసుకోవడం లేదని ఇన్‌ స్టాలో మేఘా వీడియో పోస్టు చేసింది.అది వైరల్ గా మారింది. అఖిల్ కు ఇతర యువతులతో కూడా సంబంధాలు ఉన్నాయంటూ మేఘా ఆరోపణలు చేసింది. తనను రోజూ వేధించేవాడని అందుకే అఖిల్ నుంచి పారిపోయానని తెలిపింది. కండక్టర్ అయినా, క్లీనర్ అయినా తాను అతనితోనే కలిసి ఉంటానని మేఘా స్పష్టం చేసింది. ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికే మేఘా తను పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేసింది.

అయితే తాజాగా మరోసారి ఈ వివాదంపై మేఘా స్పందించింది. ఇటీవల మేఘా తాను చెంగన్నూర్ లోని తన తండ్రి ఇంట్లో ఉన్నానని పోస్టు చేయగా.. దానికి నెటిజన్లు అనూప్ ను కూడా వదిలేశావా..? అని కామెంట్స్ పెట్టారు. అయితే ఆ కామెంట్స్ కు మేఘా స్పందించింది. తాను బస్సు డ్రైవర్ అనూప్ తో పారిపోయిన ఘటనను గుర్తు చేసింది.

Megha That s why I ran off with the bus conductorYouTuber Akhil s wife finally reveals the truth

కొద్దిరోజులైతే తననే అఖిల్ వదిలేసి ఉండేవాడని.. అందుకే తానే ముందుగా అక్కడి నుంచి వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చింది. అలాగే అఖిల్ ను వదిలేయడానికి గల కారణాలను పబ్లిక్ లో చెప్పలేనని మేఘా పేర్కొంది. అంతేకాక అనూప్ తో పారిపోయేటప్పుడు ఇంటి నుంచి బంగారం, డబ్బును కూడా తీసుకెళ్లిందని అఖిల్ చేసిన ఆరోపణలను ఆమె కొట్టిపారేసింది. తన బంగారం మాత్రమే తాను తీసుకెళ్లానని పేర్కొంది. అక్కడి నుంచి పారిపోయాక అనూప్ తో పది రోజులు గడిపానని.. అక్కడి నుంచి తన తండ్రిని కలిసి.. చివరికి అనూప్ ఇంటికి వెళ్లానని స్పష్టం చేసింది. అయితే అఖిల్- మేఘా లీగల్ గా సెపరేట్ అయ్యారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+