Vijayasai Reddy: కొత్త పార్టీ పెట్టకముందే సాయిరెడ్డి తొలి టూర్..! రెండు అజెండాలు..!

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) గతేడాది ఆ పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. అయితే మళ్లీ మనసు మార్చుకుని ఈ ఏడాది తిరిగి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో ఆయన ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ రాజకీయ పార్టీ పెడుతున్నారనే దానిపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి మరో కీలక ప్రకటన చేశారు.

ఈ నెలాఖరులో రాజకీయ పార్టీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్న విజయసాయిరెడ్డి.. అంతకంటే ముందే రాజకీయ వేడిని రగిల్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్యే గోదావరిలో దూకి చనిపోయిన పంచాయతీ రాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబంలో మిగిలిన సభ్యుల్ని పరామర్శించేందుకు సాయిరెడ్డి సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఆయన రేపు రాజమండ్రి వెళ్లబోతున్నట్లు ఓ ట్వీట్ చేశారు. లవ్‌ జీహాద్‌లో తన తల్లి సౌజన్య, తండ్రి జగదీశ్‌రెడ్డి, అమ్మమ్మ, తాతయ్యలను కోల్పోయిన 10 ఏళ్ళ బాలుడు రియాన్ష్‌ రెడ్డికి అండగా ఉంటానని తెలియజేసేందుకు రేపు ఉదయం రియాన్ష్‌ ఉన్న ఇంటికి వెళుతున్నానని సాయిరెడ్డి తెలిపారు.

VijayaSai Reddy to Meet Family in Rajahmundry Over Love Jihad Case Ahead of Political Party Launch

మత మార్పిడికి జిమ్ ట్రైనర్ సాదిక్‌ ఖాన్‌ కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేసి ఇవాళ అరెస్టు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సాదిక్ ఖాన్ మతం మారమని ఒత్తిడి చేయం వల్లే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, ఇది లవ్ జిహాదే అంటూ సాయిరెడ్డి విమర్శలు ప్రారంభించారు. అంతే కాదు తన వాదనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రేపు వారి కుటుంబాన్ని సందర్శించబోతున్నారు. ఈ పర్యటన ద్వారా సాయిరెడ్డి తన కొత్త పార్టీకి సంబంధించి రెండు మెసేజ్ లు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అది బీజేపీ అజెండాలోని లవ్ జిహాద్ అంశం కాగా, రెండవది వైసీపీకి అనుకూలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం. ఈ రెండింటిని టార్గెట్ చేసుకునే సాయిరెడ్డి రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+