Railways: ఒకే ట్రాక్‌పై రికార్డు బ్రేక్ లోడ్.. 360 కంటైనర్లతో 422 కిలోమీటర్లు పరుగులు

భారతీయ రైల్వే రవాణా రంగంలో మరొక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (JNPT) నుంచి గుజరాత్‌లోని వడోదర డివిజన్ పరిధిలో ఉన్న వర్ణామ వరకు రైల్వే శాఖ తొలిసారిగా అత్యంత భారీ 'డబుల్ స్టాక్ లాంగ్ హాల్' కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది. ఏకంగా 360 టీఈయూ (TEU - ట్వంటీ ఫుట్ ఈక్వివలెంట్ యూనిట్స్) సామర్థ్యంతో రెండు డబుల్ డెక్కర్ గూడ్స్ రైళ్లను ఒకే ట్రైన్‌గా జోడించి నడపడం గూడ్స్ రవాణా చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకున్నారు.

ఆగస్టు 21న సాయంత్రం 7 గంటలకు JNPT పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ భారీ రైలు దాదాపు 422 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని అధిగమించి వర్ణామలోని కాంకోర్ గూడ్స్ టెర్మినల్‌కు చేరుకుంది. ఈ ప్రయాణంలో రెండు భారీ రైలు రాక్‌లను ఒకదానికొకటి అనుసంధానించారు. మొదటి భాగంలో 45+1 కంటైనర్ లోడుతో 60311 నంబర్ గల పవర్‌ఫుల్ లోకోమోటివ్ 1,817 టన్నుల బరువును లాగగా, వెనుక భాగంలో 45+1 కంటైనర్లతో 24690 నంబర్ గల ఇంజిన్ 2,105 టన్నుల బరువును విజయవంతంగా చేరవేసింది. ఒకే దఫాలో ఇన్ని వందల కంటైనర్లను తీసుకెళ్లడం ద్వారా రైల్వే తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

Indian Railways Operational Milestone First Double-Stack Long-Haul Container Train Departs JNPT Mumbai
Indian Railways బిగ్ మాస్టర్ ప్లాన్.. 20,000 స్టేషన్లలో 'ట్యాంక్ టు ట్యాప్' ప్యూరిఫికేషన్!
Indian Railways బిగ్ మాస్టర్ ప్లాన్.. 20,000 స్టేషన్లలో 'ట్యాంక్ టు ట్యాప్' ప్యూరిఫికేషన్!

టెర్మినల్ రద్దీకి చెక్: వేగవంతంగా చేరనున్న సరుకులు

ఈ తరహా సుదీర్ఘ డబుల్ స్టాక్ రైళ్ల నిర్వహణ వల్ల ఓడరేవుల్లో కంటైనర్ల నిల్వలు పెరిగిపోకుండా వేగంగా ఖాళీ చేసేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా రెండు వేర్వేరు రైళ్లలో పంపాల్సిన సరుకును ఒకే ట్రాక్‌పై ఒక్కసారిగా పంపడం ద్వారా ట్రాక్ సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా, రైల్వే ఇంజిన్ల వినియోగం తగ్గనుంది. ఫలితంగా రవాణా సమయం ఆదా అవ్వడంతో పాటు పరిశ్రమలకు సరుకు రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Vande Bharat సరికొత్త రికార్డ్! ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై టాప్ స్పీడ్
Vande Bharat సరికొత్త రికార్డ్! ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై టాప్ స్పీడ్

పోర్టుల అనుసంధానానికి బూస్ట్: తగ్గనున్న లాజిస్టిక్ వ్యయం

ఈ ప్రయోగం ద్వారా భారతీయ రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా, దేశీయ లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పోర్టుల నుంచి నేరుగా లోతట్టు ప్రాంతాల్లోని టెర్మినళ్లకు సరుకులను అత్యంత చౌకగా, త్వరితగతిన చేరవేయడానికి ఈ లాంగ్ హాల్ వ్యవస్థ ఎంతో దోహదపడనుంది. భవిష్యత్తులో ప్రధాన పోర్టులను అనుసంధానిస్తూ ఇలాంటి మరిన్ని డబుల్ డెక్కర్ లాంగ్ హాల్ రైళ్లను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+