ప్రధాని మోడీ ర్యాలీకి అనుమతివ్వని మేఘాలయ ప్రభుత్వం; ఎవరూ ఆపలేరంటూ బీజేపీ ఆగ్రహం

ప్రధాని మోడీ ర్యాలీకి మేఘాలయ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే మోడీని ఎవరూ ఆపలేరంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మేఘాలయలో ఎన్నికల నేపధ్యంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. మేఘాలయ ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతి నిరాకరించి షాక్ ఇచ్చింది. ఈనెల 24వ తేదీన షిల్లాంగ్ , తురాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉండగా, మోడీ ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించింది. దీంతో మేఘాలయ ప్రభుత్వ తీరుపై బిజెపి నాయకుల అసహనం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రిని ఎవరు ఆపలేరని తేల్చి చెబుతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే

ప్రధాని మోడీ ర్యాలీ, సభకు అనుమతి నిరాకరించిన మేఘాలయ ప్రభుత్వం

ప్రధాని మోడీ ర్యాలీ, సభకు అనుమతి నిరాకరించిన మేఘాలయ ప్రభుత్వం


మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీ కోసం బిజెపి అనుమతి కోరింది. కానీ మేఘాలయ క్రీడ విభాగం అనుమతిని నిరాకరించింది. స్టేడియంలో ఇంకా కొన్ని నిర్మాణ ప్రాణులు జరుగుతున్నాయని చెబుతూ, బిజెపి దరఖాస్తును తిరస్కరించింది. 127 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గత సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన మేఘాలయ ముఖ్యమంత్రి ప్రారంభించారు.

మోడీ అంటే భయమా? ప్రశ్నిస్తున్న బీజేపీ

మోడీ అంటే భయమా? ప్రశ్నిస్తున్న బీజేపీ

స్టేడియం ప్రారంభించిన రెండు నెలల తర్వాత కూడా, నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్టేడియంలో ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి అనుకూలంగా లేదని క్రీడ విభాగం తెలియజేయడం బిజెపి శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇటీవల ప్రారంభోత్సవం చేసుకున్న స్టేడియం నిర్మాణ పనుల అసంపూర్తిగా ఉన్నాయని అందుబాటులో లేదని మీరు ఎలా చెబుతారు? అంటూ బిజెపి శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. కావాలని ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి, సభకు అనుమతి ఇవ్వడం లేదని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మేఘాలయ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ వస్తే తమకు ఇబ్బందని భావించి, అనుమతి నిరాకరిస్తుందని, మోడీని చూసి భయపడుతుందని పేర్కొన్నారు.

మోడీని ఆపటం ఎవరి తరం కాదన్న బీజేపీ

మోడీని ఆపటం ఎవరి తరం కాదన్న బీజేపీ

బిజెపి నాయకుల ర్యాలీలకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు స్టార్ క్యాంపెయినర్ల ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం భయపడుతోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. వేదిక నిర్ధారించబడనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ కొనసాగుతుందని, మోడీ మేఘాలయ ప్రజలతో మాట్లాడాలని నిర్ణయం తీసుకుంటే ఆపడం ఎవరి సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీన మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆపై మార్చి 2 వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. 60 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగనున్న ఎన్నికల నేపథ్యంలో మేఘాలయలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+