హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో సంచలన ట్విస్ట్.. భార్యే చంపించింది.. తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో ఎఫైర్..?

మేఘాలయలో దంపతుల మిస్సింగ్​ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్యే.. భర్తను చంపించినట్లు తేలింది. ఈ మేరకు భార్య సోనమ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకున్న సోనమ్.. అడ్డుగా ఉన్న భర్తను హనీమూన్ పేరుతో తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపించినట్లు తేలింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. మేఘాలయలో దంపతులు మిస్సింగ్ అని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే భార్య సోనమ్ రఘువంశీ.. తన భర్త రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా చంపించినట్లు తేలింది. ఈ మేరకు సోనమ్ రఘువంశీని ఉత్తర్ ప్రదేశ్ లోని గాజిపుర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.

సోనమ్.. తన భర్త రాజాను హనీమూన్ పేరుతో తీసుకెళ్లి ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లతో చంపించింది. ఈ కేసుకు సంబంధించిన సోనమ్ తో పాటు రాజా రఘువంశీని హత్య చేసిన ముగ్గురు కిల్లర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. రాజాను చంపమని సోనమ్ తమకు నగదు ఇచ్చినట్లు కిల్లర్స్ ఒప్పుకున్నారు.

Meghalaya Honeymoon Horror Wife s Betel Nut Bribe Leads to Husband s Murder

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్ రఘువంశీతో మే 11న వివాహం జరిగింది. మే 20న వీరిద్దరూ మేఘాలయలో హనీమూన్ కు వెళ్లారు. అయితే చివరిసారిగా వీళ్లు మే 23న కనిపించారు. ఆ తర్వాత ఏమైపోయారో తెలియదు. దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే జూన్ 3న రాజా రఘువంశీ మృతదేహాన్ని చిరపుంజీ వద్ద ఓ లోయలో పోలీసులు గుర్తించారు. అప్పటికి సోనమ్ జాడ తెలియదు.

అయితే రాజా మృతదేహం లభ్యం కావడంతో సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. సోనమ్‌ తో పాటు మధ్యప్రదేశ్‌ కు చెందిన మరో ముగ్గురి కిల్లర్స్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరి సోనమ్.. తన భర్తను ఎందుకు మర్డర్ చేయాలనుకుంది..? అయితే తమ ఇంట్లో పనిచేసే ఐదేళ్లు చిన్నవాడైన రాజ్ కుష్వాహాతో సోనమ్‌ ఎఫైర్‌ పెట్టుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ ఎఫైర్ కొనసాగించింది. అడ్డుగా ఉన్న భర్తను పథకం ప్రకారం హతమార్చాలని ప్లాన్ వేసింది.

హనీమూన్ నాటకం ఆడి భర్తను మేఘాలయ తీసుకెళ్లింది. అక్కడే రాజ్ కుష్వాహా , మరో ఇద్దరు రాజా రఘువంశీని పరిచయం చేసుకున్నారు. తాము ఎవరో తెలియనట్లుగా నటించారు. మేఘాలయాలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాజాను హతమార్చి లోయలో పడేసి అందరూ జంప్ అయ్యారు. కానీ ఇటీవల పోలీసులు రాజా మృతదేహాన్ని కనుగొనడంతో వాళ్లు భయపడ్డారు. ఈ మేరకు సోనమ్ పోలీసులకు లొంగిపోయింది. మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+