కశ్మీర్‌ను ఆఫ్గన్‌తో పోల్చిన మెహబూబా ముఫ్తీ... సహనాన్ని పరీక్షించొద్దని మోదీ సర్కార్‌కు వార్నింగ్...
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కశ్మీర్‌ను ఆఫ్గనిస్తాన్‌తో పోల్చారు. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బ్యాగ్ సర్దుకోవాల్సి వచ్చిందని... ఆఫ్గన్‌ను చూసైనా మోదీ సర్కార్ పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. ఇకనైనా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై కశ్మీరీలతో చర్చలు జరపాలని అన్నారు.
'మా సహనాన్ని పరీక్షించకండి.ఇకనైనా మీ పద్దతులు మార్చుకోండి.. ఇంకా అందుకు అవకాశం ఉంది.ఒకసారి గతంలో వాజ్‌పేయి జరిపిన శాంతి ప్రక్రియను గుర్తుచేసుకోండి. కశ్మీరీలతో తప్పనిసరిగా మీరు చర్చలు జరపాల్సిందే. కశ్మీర్ నుంచి ఏవైతే లాగేసుకున్నారో వాటిని తిరిగి ఇచ్చేయాల్సిందే.' అని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు.

మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన తల్లిని మూడు గంటల పాటు విచారించడంపై మెహబూబా ముఫ్తీ ఘాటుగా స్పందించారు. దురదృష్టవశాత్తు మన హక్కులను,దేశ స్పూర్తిని,రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సంస్థలు తాలిబన్ల మాదిరి(Talibanised) వ్యవహరిస్తున్నాయంటూ విమర్శించారు. ఆఖరికి మీడియా కూడా అలాగే తయారైందన్నారు. ప్రధాన స్రవంతి మీడియా మెజారిటీ మీడియా బీజేపీకి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. దేశంలోని వ్యవస్థలను ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందనే దానిపై మీడియా మాట్లాడట్లేదన్నారు.
జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ఏర్పాటు చేసిన కమిషన్‌తో భేటీకి తాను తిరస్కరించానని... ఆ మరుసటిరోజే తనకు నోటీసులు జారీ అయ్యాయని గుర్తుచేశారు. ఎన్ఐఏ,ఈడీ లాంటి సంస్థలను రాజకీయ నేతలపై,సామాజిక కార్యకర్తలపై,మీడియా ప్రతినిధులు,విద్యార్థులపై ఎక్కుపెట్టడం దురదృష్టకరమన్నారు.
రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది పాటు కశ్మీర్ కీలక నేతలను ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. సరైన సందర్భంలో కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని చెప్పిన ప్రభుత్వం... రెండు నెలల క్రితం ఆ ప్రక్రియను ప్రారంభించినట్లే కనిపించింది. ప్రధాని మోదీ కశ్మీర్‌కి చెందిన అన్ని పార్టీల నేతలతో సమావేశమవడంతో దీనికి బలం చేకూరినట్లయింది. అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల డీలిమిటేషన్ పైనే ఫోకస్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. దీనికోసం ఏర్పాటు చేసిన కమిషన్ ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమైంది.












Click it and Unblock the Notifications