మోదీతో బేర్ గ్రిల్స్: రెండు విషయాలు తెలుసుకున్నా..!!
ప్రధాని నరేంద్ర మోదీ మెరిసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ ఇప్పుడు మళ్లీ తెరమీదికి వచ్చింది. బ్రిటన్ కు చెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్.. మోదీతో చిత్రీకరించిన ఎపిసోడ్స్ ను గుర్తు చేసుకుంటూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చ
న్యూఢిల్లీ: డిస్కవరీ ఛానల్ క్రమం తప్పకుండా చూసే వారికి చిర పరిచితమైన ఎపిసోడ్.. మ్యాన్ వర్సెస్ వైల్డ్. బ్రిటన్ కు చెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ నిర్వహించే అడ్వెంచర్ ప్రోగ్రామ్ అది. ఒంటరిగా దట్టమైన అడవులు, ఆకాశానంటే పర్వతాలు, నిప్పుల కొలిమిని తలపించే ఎడారుల్లో కలియ తిరుగుతూ, ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని కళ్లముందుకు తీసుకొచ్చే కార్యక్రమం అది.

మెరిసిన మోదీ..
అదే ఎపిసోడ్ లో ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెరిశారు. బేర్ గ్రిల్స్ తో కలిసి నరేంద్ర మోదీ చేసిన అడ్వెంచర్ ను 2019లోనే ఈ ప్రపంచం కళ్లారా చూసింది. మోదీ కనిపించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ స్పెషల్ ఎపిసోడ్ 2019 మార్చి 12వ తేదీన రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఇండియాలో ప్రసారమైంది. మొత్తం 180 దేశాల్లో ఒకేసారి ఈ ఎపిసోడ్ ప్రసారమైందప్పట్లో.

జిమ్ కార్బెట్ లో..
ఈ ఎపిసోడ్ మొత్తాన్నీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు. దీని కోసం బేర్ గ్రిల్స్ భారత్ కు వచ్చారు. 2019 ఫిబ్రవరిలో ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కొనసాగింది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ కోసం నరేంద్ర మోదీ ఈ సాహసానికి పూనుకున్నారంటూ అప్పట్లో ప్రశంసించారు బేర్ గ్రిల్స్.

చురుగ్గా మోదీ..
ఈ ఎపిసోడ్ ప్రసారమైన తరువాత ప్రజలకు అడ్వెంచర్ ట్రిప్ లపై మరింత ఆసక్తి కలుగుతుందని, వన్యజీవులను సంరక్షించాలనే బాధ్యత గుర్తుకు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. యుక్త వయస్సులో హిమాలయాల్లో తిరుగాడిన అనుభవం ఉన్న నరేంద్ర మోదీ..అత్యంత క్లిష్టమైన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ లోనూ చురుకుగా కనిపించారు.

పర్యావరణ పరిరక్షణ..
పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, జంతువధను నిషేధించాల్సిన అవసరాన్ని మోదీ ఈ ఎపిసోడ్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రకృతికి ఎదురెళ్తే వినాశనం తప్పదనీ హెచ్చరించారు. ప్రకృతిని విధ్వంసం చేయాలని మనిషి నిర్ణయం తీసుకుంటే.. అతనికి అన్నీ ప్రమాదకరంగానే కనిపిస్తాయని అన్నారు. మనిషి సైతం అత్యంత ప్రమాదకారి అని చెప్పారు.

నాటి ఫొటో షేర్..
ఈ ఎపిసోడ్స్ ను బేర్ గ్రిల్స్ తాజాగా గుర్తు చేసుకున్నారు. చిత్రీకరణ జరుపుకొని నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బేర్ గ్రిల్స్- ప్రధాని మోదీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. మోదీతో ఎపిసోడ్స్ చిత్రీకరణ ద్వారా తాను రెండు విషయాలు తెలుసుకున్నానని వివరించారు. మొదటిది- అడవులు ఎప్పుడు గొప్పవేనని చెప్పారు. రెండోది- తన ర్యాఫ్ట్ లీక్ అవుతుందనేది తెలిసొచ్చిందని జోక్ చేశాడు.
Memory of a very wet rainforest adventure with the PM of India! @narendramodi - Two things I know: the wild is always the great leveller - and my raft was definitely leaking… 🤪☔️🌊 #India #Adventure #NeverGiveUp @discoveryplus @discoveryplusIN pic.twitter.com/9AZfRvWpKW
— Bear Grylls (@BearGrylls) February 27, 2023












Click it and Unblock the Notifications