డెల్టా రైతులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజులు నీటి విడుదల!

డెల్టా రైతుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎల్ నినో కారణంగా వర్షాకాలం ఆశించినంతగా కలిసిరాకపోయినా, పండించిన పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మేట్టూరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తాగునీటి ఎద్దడిని తీర్చడంతో పాటు కావేరీ డెల్టా ప్రాంతంలో వ్యవసాయ సాగుకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Mettur Dam Water Release Tamil Nadu to Open Gates for Delta Irrigation from September 1 for 45 Days
దక్షిణాది సీఎంల దండయాత్ర.. అమిత్ షా ముందు జల జగడం!
దక్షిణాది సీఎంల దండయాత్ర.. అమిత్ షా ముందు జల జగడం!

తమిళనాడు గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం డ్యామ్‌లో ఉన్న నీటి మట్టం, వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోను పరిగణనలోకి తీసుకుని రాబోయే 45 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 1న తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్వయంగా మేట్టూరు డ్యామ్ గేట్లను ఎత్తి డెల్టా రంగానికి నీటిని విడుదల చేయనున్నారు. రైతులు, స్థానిక ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్ కు వద్దన్నా నీటిని విడుదల చేస్తోన్న కేంద్రం- ఫ్లాష్ ఫ్లడ్స్ దెబ్బకు
పాకిస్తాన్ కు వద్దన్నా నీటిని విడుదల చేస్తోన్న కేంద్రం- ఫ్లాష్ ఫ్లడ్స్ దెబ్బకు

సుప్రీంకోర్టు తుది ఆదేశాలపై ఉత్కంఠ

మరోవైపు కర్ణాటక నుంచి రావలసిన కావేరీ జలాల వాటాపై తమిళనాడు ప్రభుత్వం న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉంది. తమకు రావాల్సిన నీటిని కర్ణాటక సకాలంలో విడుదల చేయడం లేదని, కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఈ వివాదంపై తిరిగి జూలై/ఆగస్టు సమీక్షల క్రమంలో అథారిటీనే సంప్రదించాలని సూచించింది. ఈ పిటిషన్‌పై ఆగస్టు 31న సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తమ సొంత నీటి నిల్వల ద్వారా రైతులను ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందడుగు వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+