పద్మ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు- కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయం..
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ తేదీని పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఇవాళ నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా.. దాన్ని సెప్టెంబర్ 15 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నెల 15 వరకూ ప్రతిపాదనలు స్వీకరించనున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పద్మ అవార్డులను కేంద్ర హోంశాఖ వర్గాలు ఖరారు చేస్తాయి.

Recommended Video
వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు అందజేస్తుంది. ఇందులో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ కేటగిరీల్లో అవార్డులు అందజేస్తారు. వీటి కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తారు. ఇప్పటివరకూ ప్రభుత్వాల నుంచి 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. ఏటా గణతంత్ర దినోత్సవం రోజున ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!












Click it and Unblock the Notifications