Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలో అల్లర్లు జరిగే అవకాశం - రాష్ట్రాలకు కేంద్రం బిగ్ అలర్ట్..!!

ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల వేళ కేంద్రం అప్రమత్త మైంది. ఈ యుద్దం వేళ చోటు చేసు కొంటున్న పరిణామాల వేళ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ముందస్తు చర్యల పైన హెచ్చరిక లు చేసింది. దేశంలో ఎక్కడా సామాజిక, మత పరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పూర్తి అప్రమత్తత తో వ్యవహరించాలని నిర్దేశించింది. అటు యుద్దం వేళ భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా పడే అవకాశాలపై కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక లేఖ రాసింది. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం, అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు చేపట్టిన సైనిక చర్యల తర్వాత దేశంలో కొన్ని వర్గాలు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.

mha-has-alerted-states-about-potential-violence-in-india-following-israel-us-strikes-against-iran

ఫిబ్రవరి 28న రాష్ట్రాలకు పంపిన లేఖలో అప్రమత్తంగా ఉండాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ముఖ్యంగా మతపరమైన సభలు, సమావేశాలు, ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలపై నిఘా హోంశాఖ లేఖలో కీలకంగా ప్రస్తావించిన అంశం రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారి పైన అప్రమత్తం ఉండాలని సూచించింది. సోషల్ మీడియా వేదికల్లో కూడా పుకార్లు, తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని, వాటిని వెంటనే అరికట్టాలని సూచించింది.

యుద్దం వేళ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

అదే విధంగా ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం పెంచాలి రాష్ట్ర పోలీస్ విభాగాలు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్లు, కేంద్ర ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచాలని కేంద్రం తెలిపింది. అనుమానాస్పద సమావేశాలు, గుంపులు, విద్వేషపూరిత పోస్టులు, విదేశీ నిధుల ప్రవాహం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునేలా కంట్రోల్ రూమ్‌లను సిద్ధంగా ఉంచాలని, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా.. అటు కేంద్రం భారతీయుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ దౌత్యపరమైన చర్యలు చేపడుతోంది.

ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా నిరోధించాలనే ఉద్దేశంతో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉండే సమాచారాన్ని వెంటనే తొలగించాలనీ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

MHA has alerted states about potential violence in India following Israel-US strikes against Iran
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+