ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయా?- మీరు డేంజర్ లో ఉన్నట్టే
దేశంలో ఆధునిక సాంకేతికత, డిజిటల్ వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ- కొత్త రకం సైబర్ నేరాలు పుట్టుకొస్తోన్నాయి. డిజిటల్ అరెస్టులు, డిజిటల్ కుంభకోణాలు తీవ్రతరం అయ్యాయి. ఈ మోసాల బారిన ఇప్పటికే పలువురు చిక్కుకున్నారు. సర్వం పోగొట్టుకున్న వాళ్లూ లేకపోలేదు.
డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ కొందరు మోసగాళ్లు పోలీసు అధికారులుగా లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేయడం, లేదంటే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించిన ఉదంతాలు ఇప్పటికే చాలా చోటు చేసుకున్నాయి. దీనివల్ల బాధితులు కోట్ల రూపాయల మేర నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఈ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. అంచెల వారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. కంప్లైంట్ రిజిస్ట్రేషన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, విస్తృత ప్రజా అవగాహన వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.
ముంబైలో సైబర్ పోలీసులు ఇటీవలే 20 సంవత్సరాల వయస్సున్న కార్తీక్ చౌదరిని అరెస్టు చేశారు. డిజిటల్ స్కాం, డిజిటల్ అరెస్ట్ ద్వారా 81 ఏళ్ల వృద్ధురాలి నుంచి 7.8 కోట్ల రూపాయలను మోసం చేసిన కేసులో అతను నిందితుడు. డిజిటల్ స్కామ్ ముఠాకు అతను సహకరించాడు.
బాధితురాలిని అరెస్టు చేస్తామని ఫేక్ కాల్స్, మెసేజీలతో బెదిరించారు. దీంతో ఆమె తన సేవింగ్స్ మొత్తాన్నీ వారికి చెల్లించడానికి సిద్ధపడ్డారు. కార్తీక్ చౌదరి మనీ మ్యూల్‌గా వ్యవహరించాడీ కేసులో. 1.98 లక్షల రూపాయలను విత్‌డ్రా చేసి, కమీషన్ తీసుకున్నాడు. ఇలాంటి మోసాలు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైతో సహా దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.
జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల వల్ల దేశవ్యాప్తంగా 120.3 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని సాధారణ ప్రజలు నష్టపోయారు. బ్యాంక్ ఖాతాలు, ఆధార్ నంబర్లు, కొరియర్ ప్యాకేజీలు వంటివి.. క్రిమినల్ కేసులతో ముడిపడి ఉన్నాయని నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించడం పరిపాటిగా మారింది.
ఇలాంటి మోసాలను అరికట్టడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ప్రజలకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంది. ఏ ప్రభుత్వ సంస్థ కూడా అలాంటి డిజిటల్ అరెస్టులకు సంబంధించిన నోటీసులను జారీ చేయబోదని స్పష్టం చేసింది. ఇలాంటి అరెస్టులపై అప్రమత్తంగా ఉండాలని పౌరులను కోరింది.
డిజిటల్ అరెస్టులు అంటూ ఫోన్ కాల్స్ అందితే.. బాధితులు తక్షణమే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో రిజిస్టర్ చేయవచ్చు లేదా హెల్ప్ లైన్ 1930 నంబర్ కు ఫోన్ చేయవచ్చు.
సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ఇప్పటికే అనుమానాస్పద ఖాతాలను స్తంభింపజేసింది. దీని ద్వారా అక్రమార్జన లావాదేవీలను అడ్డుకుంది. సైబర్ నేరాలకు సంబంధించిన 9.42 లక్షల సిమ్ కార్డులు, 2.63 లక్షల ఐఎంఈఐలను అయ్యాయి. నకిలీ అంతర్జాతీయ కాల్స్‌ను అరికట్టడానికి టెలికాం సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేస్తోన్నాయి.
దినపత్రికలు, టీవీ, ప్రసార భారతి, సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫామ్ ల ద్వారా ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), దాని సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ బ్యాంకులు, టెలికాం ప్రొవైడర్లు, రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తున్నాయి.
ఈ విషయంలో ప్రజలకు అవసరమైన తక్షణ సహాయాన్ని అందించడానికి హోం మంత్రిత్వ శాఖ.. ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను సైతం వినియోగించుకుంటోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ద్వారా ప్రజలకు చైతన్యాన్ని కలిగిస్తోంది.
దీనిపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడానికి, డిజిటల్ అరెస్టుల నుంచి బయటపడటానికి చిట్కాలను ఇవ్వడానికి, అవగాహన కల్పించడానికి.. డైలీహంట్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్.. వంటి ప్లాట్‌ఫామ్‌లలో సైబర్‌డోస్ట్‌ను అనుసరించండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుని, అప్రమత్తంగా ఉండండి. ఆన్‌లైన్, డిజిటల్ మోసాల నుంచి సురక్షితంగా ఉండండి.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications