వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలు..? బోణి కొట్టకపోవడానికి కారణాలు ఇవే

|
Google Oneindia TeluguNews

ముంబై ఇండియన్స్.. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్.. కానీ ఈ సారి బోణీ కూడా కొట్టలేదు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. సో.. ఆ టీమ్‌లో ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది. దీనికి సంబంధించి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ విశ్లేషణ చేశాడు. జట్టు ఇదివరకటిలా లేకపోవడానికి గల కారణం వివరించారు.

ఈ సారి ఏడు మ్యాచ్ లు ఆడింది. అయినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. దీంతో లోపం ఎక్కడుంది? అనే ప్రశ్న సహజనం.. దానికి ఇంగ్లండ్ మాజీ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ సమాధానం ఇచ్చాడు. మెగా వేలంతో ఆ జట్టు వైఫల్యం మొదలైందని చెప్పారు. ఆ వేలం వల్ల జట్టు ఆత్మ పూర్తిగా తునాతునకలైందని అన్నాడు. వేలంలో ముంబై వ్యూహంపై మండిపడ్డాడు. గాయంతో ఉన్న జోఫ్రా ఆర్చర్ కోసం మంచి ఫామ్‌లో ఉన్న ట్రెంట్ బౌల్ట్‌ను వదిలేసుకోవడం అతిపెద్ద తప్పని చెప్పాడు.

mi team failure this ipl season, reason is

ముంబై బౌలింగ్ చాలా బలహీనంగా మారిపోయిందని వివరించాడు. బలహీన బౌలింగ్ ఇంతకుముందెన్నడూ లేదని చెప్పాడు. పొట్టి గేమ్‌లో లెఫ్టార్మ్ సీమర్లు చాలా అవసరమని, అందులో బౌల్ట్ వరల్డ్ క్లాస్ అని కామెంట్ చేశాడు. వేలంలో మ్యాచ్ విన్నర్లయిన పాండ్యా సోదరులు, క్వింటన్ డికాక్ వంటి వారిపై దృష్టిసారించకపోవడం విచారకరం అన్నారు. ఇవీ చాలా కీలక తప్పిదాలు అని వివరించారు.

జట్టులో ఏం జరుగుతోందో తెలియక మహేలా జయవర్ధనే షాక్ అవుతుండొచ్చు అని కామెంట్ చేశాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లను మాత్రం కోల్పోయిందని.. అందుకే వరసగా ఓటమి పాలవుతుందని అంచనా వేశాడు. నిజానికి ఈ అనాలిసిస్ వాస్తవమే.. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతగా టీమ్ ఓటమి పాలవుతుంది. మొన్న చెన్నై మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. చివర్లో ఆడటంతో గౌరవప్రద స్కోర్ చేసింది. అయితే చెన్నై వికెట్లు పోయినా.. మహేంద్రుడి మాయాజాలంతో.. ఓటమి తప్పలేదు. సో ఇప్పటికే ఆ రెండు జట్లు టోర్నీ నుంచి తప్పుకున్నట్టే.. కానీ మిగతా మ్యాచులలో గెలిస్తే.. గౌరవం అయినా దక్కతుందని విశ్లేషకుల భావన

English summary
mi team failure in this ipl season, reason is boult and panda brothers out in team kevin peterson said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X