చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు భారీగా వలస కార్మికులు... లాక్‌డౌన్ భయంతో స్వస్థలాలకు...

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ,లాక్‌డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ అమలులో ఉండగా... తాజాగా ఢిల్లీలో వారం రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ ప్రకటించారు. మున్ముందు మిగతా రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్స్ విధిస్తారేమోనని వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు,కేరళ వంటి రాష్ట్రాల్లో వలస కార్మికులు తిరిగి స్వస్థలాల బాట పడుతున్నారు. అక్కడి రైల్వే స్టేషన్లకు వారు భారీగా చేరుకుంటున్నారు.

సెంట్రల్ చెన్నై రైల్వే స్టేషన్ వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. కేరళలో పనిచేసే 24 ఏళ్ల బాదల్ దాస్ అనే వలస కార్మికుడు కేరళ నుంచి మరో 10 మందితో కలిసి సెంట్రల్ రైల్వే స్టేషన్‌‌కి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ..'మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని చెబుతుంటే విన్నాను. కాబట్టి మళ్లీ మాకు తిండి కూడా దొరకని పరిస్థితులు తలెత్తకముందే కేరళ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో మేము మళ్లీ తిరిగొస్తాం... అయితే ఈ పరిస్థితి సద్దుమణిగిన తర్వాతే వెనక్కి వస్తాం..' అని చెప్పాడు.

migrant workers leaving Tamil Nadu and kerala fearing of lock down

జుల్ఫికర్ అనే మరో వలస కార్మికుడు మాట్లాడుతూ... ఒకవేళ మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ఎక్కడ ఇక్కడే చిక్కుకుపోతామోనన్న భయంతో అందరూ స్వస్థలాలకు వెళ్తున్నట్లు చెప్పాడు. 'రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోందని వార్తల్లో చెబుతున్నారు. కొత్త గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ఇదే క్రమంలో లాక్‌డౌన్ కూడా విధిస్తే మేమిక్కడే చిక్కుకుపోతాం. అందుకే ముందుగానే వెళ్లిపోతున్నాం.' అని తెలిపాడు. మరోవైపు రైల్వే అధికారులు మాట్లాడుతూ... ప్రస్తుతం తగినన్ని రైళ్లు అందుబాటులో ఉన్నాయని,కాబట్టి ప్రయాణాలకు ఇబ్బందేమీ లేదని చెప్పారు.

ప్రస్తుతం తమిళనాడులో రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. అటు కేరళలో ఇండోర్,అవుట్ డోర్ కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇండోర్ కార్యక్రమాలకు 75 మంది,అవుట్ డోర్ కార్యక్రమాలకు 150 మందికి మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వచ్చేవారు తప్పనిసరిగా ఈ-జాగ్రత్త పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే రాష్ట్రానికి వచ్చే 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+