కచ్‌లో భూప్రకంపనలు: ప్రజల్లో భయాందోళనలు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని కచ్‌లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కచ్‌లో శనివారంనాడు స్వల్పంగా భూమి కంపించింది. శనివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ప్రకంపనలు రెక్టార్ స్కేలుపై 3.4గా నమోదయ్యాయి.
ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రకంపనల వల్ల ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించ లేదు. ప్రకంపనలు ఉదయం 6.32 గంటలకు చోటు చేసుకున్నాయి. తీవ్రత చాలా స్వల్పంగా ఉందని భారత మెటీరియోలాజికల్ సంస్థ తెలిపింది. ప్రకంపనల కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలియాల్సి ఉంది.

కచ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దధాయ్ గ్రామంలోనే కాకుండా రాపార్, గధ్‌శిషా ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
కచ్‌లో గతంలో భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. 2001లో సంభవించిన ఆ భూకంపంలో పదివేల మందిదాకా మరణించారు.












Click it and Unblock the Notifications