వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో ఘాతుకం: మహిళా పోలీస్ అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్ : కశ్మీర్‌లో మరోసారి తుపాకుల మోత వినిపించింది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని వేహిల్ ఏరియాలో మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఇందులో మహిళా స్పెషల్ ఆఫీసర్ మృతి చెందారు. అధికారిక సమాచారం ప్రకారం ఖష్బూ అనే మహిళను శనివారం మధ్యాహ్నం కొందరు మిలిటెంట్లు కాల్చి చంపినట్లు తెలుస్తోంది.ఈ ఘటన ఆ మహిళా స్పెషల్ ఆఫీసర్ ఇంటి బయటే జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేసు లేదు, వేధించలేదు .. ఉగ్రవాద సంస్థల ప్రేరేపితమే కారణం.. ముదసిర్ తండ్రి వెల్లడికేసు లేదు, వేధించలేదు .. ఉగ్రవాద సంస్థల ప్రేరేపితమే కారణం.. ముదసిర్ తండ్రి వెల్లడి

Militants gun down woman police officer outside her house in Kashmirs Shopian

మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలో ఖష్బూపై కొందరు మిలిటెంట్లు కాల్పులు జరిపారని తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల పాల్పడిన ఈ దారుణాన్ని ఖండిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఖుష్బూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ఖుష్బూ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే ఘటన జరిగిన స్థలాన్ని ఆర్మీ తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లో పూంచ్ సెక్టార్‌లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాక తాజాగా మహిళా అధికారి పై కాల్పులు జరగడం విశేషం. జిల్లాలోని మాన్‌కోట్ సెక్టార్‌లోకి పాక్ దళాలు భారీగా బుల్లెట్ల వర్షం కురిపించాయి. పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత కశ్మీర్‌లో క్రమంగా హింస పెరుగుతోంది. సెక్యూరిటీ చాలా గట్టిగా ఉన్నప్పటికీ ఉగ్రవాదులు మాత్రం జవాన్లను హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

English summary
A woman special police officer (SPO) was shot dead by suspected militants at Vehil area of south Kashmir's Shopian district on Saturday afternoon.According to official sources, suspected militants gunned down Khushboo Jan at around 2:40 pm outside her home in Vehil village. Police have also registered a case and started investigation in the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X