మిల్కా సింగ్: కోవిడ్ బారిన పడి చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్

భారత ప్రఖ్యాత అథ్లెట్ మిల్కా సింగ్ చండీగఢ్‌లో మరణించారు. ఆయన కొంతకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్నారు.
కరోనా సోకిన తరువాత 91 ఏళ్ల మిల్కా సింగ్‌ను చండీగఢ్‌లోని పీజీఐఎంఆర్ ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.
శుక్రవారం రాత్రి 11.30కు మిల్కా సింగ్ మరణించినట్లు ఆస్పత్రి ప్రతినిధి అశోక్ కుమార్ బీబీసి జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్‌కు తెలిపారు.

మే 20 నుంచి మిల్కా సింగ్ కోవిడ్‌తో బాధపడుతుండగా జూన్ 3న ఆయనను ఐసీయూలో చేర్చారు. జూన్ 13 వరకు ఆయన ఐసీయూలోనే ఉంటూ కోవిడ్‌ను జయించారు.
తరువాత కోవిడ్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చినప్పటికీ, ఇతర ఆరోగ్య ఇబ్బందుల కారణంగా ఆయనను మళ్లీ ఐసీయూలో చేర్చవలసి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని వైద్యులు చెప్పారు.
ఐదు రోజుల క్రితం మిల్కా సింగ్ సహచరి నిర్మల్ మిల్కా సింగ్ కూడా కోవిడ్‌తో మరణించారు.
ఇవి కూడా చూడండి:
- 'నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- "నేను కరోనా వ్యాక్సీన్ రెండు డోసులూ వేసుకున్నాను. అయినా, కోవిడ్ వచ్చింది" - ఒక డాక్టర్ అనుభవం
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications