బీజేపీ చీఫ్ చెప్పినట్టే జరిగిందిగా: మంత్రి అరెస్ట్

చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు చెందిన కీలక నాయకుల నివాసాలపై గతంలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు.. అరెస్టులకు దారి తీశాయి. విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐటీ అధికారులు సెంథిల్ బాలాజీ నివాసం, కార్యాలయాలపైనా ఏకకాలంలో దాడులు చేశారు.

ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అరెస్ట్‌ను డీఎంకే తప్పుపట్టింది. రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తోంది.
ఎక్సైజ్ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న సెంథిల్ బాలాజీపై అందిన ఫిర్యాదుల ఆధారంగానే ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. మనీలాండరింగ్ పాల్పడినట్లు తేలడంతో మంత్రిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేస్తోన్నారు.

Minister Senthil Balaji breaks down after ED took him into custody

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు త్వరలోనే విస్తృతంగా దాడులు జరపబోతోన్నారని, కొందరు కీలక వ్యక్తులు అరెస్ట్ అవ్వొచ్చంటూ తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో సెంథిల్‌ బాలాజీ అరెస్ట్‌ అవుతారని కూడా స్పష్టం చేశారాయన. దీనిపై సెంథిల్ బాలాజీ అప్పట్లో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా అన్నామలై ఎప్పుడు అపాయింట్ అయ్యారంటూ సెటైర్లు వేశారు.

ఇప్పుడు అదే సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో చెన్నై, కోయంబత్తూరు, కరూర్.. వంటి ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులుు చేశారు. సెంథిల్ బాలాజీ పర్యవేక్షిస్తోన్న మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, ఆయనకు సన్నిహితంగా ఉండే వారిని టార్గెట్ చేశారు. ఈ దాడుల సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారని, దాని ఆధారంగా ఆయనను అరెస్ట్ చేశారని చెబుతున్నారు.

అరెస్ట్ అనంతరం వైద్య పరీక్షల కోసం ఆయనను చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన భోరమంటూ విలపించడం కనిపించింది. తోటి మంత్రులు పొన్ముడి, అన్బిల్ మహేష్ సహా డీఎంకేకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రిలో సెంథిల్ బాలాజీని పరామర్శించారు. కక్షపూరిత చర్యగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+