షాకింగ్: పోలీసుల కీచక పర్వం, మైనర్ బాలికను గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి...

సామాన్యులకు భద్రత కల్పించిన రక్షకభటులే కీచకుల అవతారమెత్తారు. ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారిపై వేటు పడింది.

కాన్పూర్: సామాన్యులకు భద్రత కల్పించిన రక్షకభటులే కీచకుల అవతారమెత్తారు. ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారిపై వేటు పడింది.

ఈ దారుణం.. ఉత్తరప్రదేశ్‌లోని గోవింద్ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇన్‌స్పెక్టర్ దుర్గా రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ స్థానికంగా నివాసం ఉంటున్నారు. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని వీరిద్దరూ నిత్యం వేధింపులకు గురిచేసేవారు.

ఈ క్రమంలో ఇటీవల ఆ విద్యార్థిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వీరు ఆమెను అడ్డగించారు. తమ పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా ఎక్కించుకుని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు.

Minor allegedly raped by two UP Police personnel

తనను ఏం చేయవద్దని బాధితురాలు ఎంతగా ప్రాధేయపడినా ఈ మృగాళ్లు ఆమె గోడును వినిపించుకోలేదు. కీచకపర్వాన్ని కొనసాగించారు. ఆ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆ బాలికను బెదిరించి, ఓ చోట వదిలేసి వెళ్లారు. బాధిత బాలిక ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

అయితే అత్యాచారానికి పాల్పడింది పోలీసులే కావడంతో కేసు నమోదు చేయకుండానే బాధిత బాలిక కుటుంబ సభ్యులను పోలీసులు ఇంటికి పంపించేశారు. ఈ విషయం సామాజిక కార్యకర్త లక్ష్మీ గౌతమ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, జరిగిన విషాదం మీడియా ద్వారా వెలుగుచూడటంతో మథుర ఎస్పీ స్పందించారు

ఆయన ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదుచేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఇన్‌స్పెక్టర్ దుర్గా రమాకాంత్ పాండే, ప్రవీణ్ ఉపాధ్యాయ్‌ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+