హెలికాప్టర్‌లో మంటలు: సిద్ధరామయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ పైలట్ అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శనివారం ఆయన బెంగళూరు నుంచి మైసూరు హెలికాప్టర్‌లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
హెలికాప్టర్‌లో కూర్చోగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్ని గుర్తించిన పైలట్, భద్రతాధికారులు హుటాహుటిన సిఎం సిద్ధరామయ్యను కిందకు దించేశారు. పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమదం తప్పిందని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వాధినేతలు ఉపయోగించే హెలికాప్టర్లకు ఇలాంటి ప్రమాదాలు జరగడం ఆందోళన చెందాల్సిన విషయమే.












Click it and Unblock the Notifications