అసభ్యంగా ప్రవర్తించి..: పొలం వెళ్లిన బాలిక రేప్, హత్య

పదహారేళ్ల బాలికను ఈ నెల 21వ తేదీన అదే తండాకు చెందిన రంగప్ప, మూర్తి నాయక్, అంబు, హనుమంతలతో పాటు మరో ఎనిమిది మంది అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతకుముందు మూడురోజుల ముందు 18వ తేది రాత్రి నిందితులు తాగిన మైకంలో బాలిక ఉంటున్న ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు.
ఆ సమయంలో బాలిక సోదరుడు ప్రతిఘటించారు. దీంతో వారు వెనుదిరిగారు. బాలిక పైన కక్ష గట్టారు. ఆమె కదలికలపై కన్నేశారు. 21న ఆమె పొలం పనులకు వెళ్లిన సమయంలో వారు ఆమెను అపహరించారు. అత్యాచారం చేసి, హత్య చేశారు.
బాలిక మృతదేహాన్ని శనివారం ఓ కాలువలో గుర్తించారు. దీనిపై మృతురాలి కుటుంబ సభ్యులు హట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications