దాష్టీకం: అక్కతో సహజీవనం, చెల్లెలిపై అత్యాచారం

లీలారామ్ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కాగా, వాళ్లతోపాటు ఆ మహిళ చెల్లెలు కూడా వారితో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన లీలారామ్ సెప్టెంబర్ 6వ తేదీన ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే లీలారామ్ ఆమెపై అత్యాచారం చేస్తుండగా పొరుగున ఉండే ఓ మహిళ చూసింది. ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లీలారామ్ ఆ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమెను బయటకు కూడా వెళ్లనివ్వలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
నిందితుడిపై ఐపిసి, పోక్సో సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపిన పోలీసులు, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications