మైనర్‌పై లైంగిక వేధింపులు: అరగుండు, గ్రామ బహిష్కరణ, ఎక్కడంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu
  Bizarre : Minor girl’s hair half Shaved video Going Viral

  కావర్ణా: లైంగిక వేధింపుల‌కు గురైన ప‌ద‌మూడేళ్ల బాలికకు శుద్ధీక‌ర‌ణ పేరుతో గ్రామ పెద్దలు అరగుండు చేయించారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కవర్ణాలో చోటు చేసుకొంది.బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు మాత్రం గ్రామంలో యధేచ్చగా తిరుగుతున్నారు. మైనర్‌ అని చూడకుండా బాధితురాలిని గ్రామం నుండి బహిష్కరించాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు

  లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని దండించాల్సింది పోయి, బాధితురాలికి శిక్ష విధించారు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని గ్రామ పెద్దలు. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి శుద్తీ చేశారు.

  Minor girl’s hair half shaved over alleged eve teasing incident

  బాధితురాలిని శుద్దీ చేసే పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు.బాధితురాలికి అరగుండు చేయించారు.అంతేకాదు గ్రామానికి దూరంగా ఉండాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు. గ్రామ పెద్దలు చెప్పినట్టే నడుచుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

  బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన అర్జున్ యాదవ్ అనే యువకుడు గ్రామంలో స్వేచ్చగా తిరుగుతున్నాడు. అయితే ఈ విషయం మీడియాలో రావడంతో పోలీసులు అర్జున్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. బాలికను గ్రామం నుండి బహిష్కరిస్తూ తీర్పు చెప్పిన గ్రామ పెద్దలు గ్రామం విడిచి పారిపోయారు.నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A minor girl was excommunicated and her head was half shaved over alleged incident of eve teasing in Kawardha of Chhattisgarh. The decision was given by the panchayat of her own tribe.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి