షాకింగ్: దాటుదామని రైలు కింద దూరాడు.. అంతలో రైలు కదిలింది..

ఓ వ్యక్తిపైనుంచి రైలు వెళ్లినా అతడికేమీ కాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోగా చూసిన వారంతా నోరెళ్లబెట్టారు.

లక్నో: భూమ్మీద నూకలుండాలిగానీ.. మృత్యు ముఖద్వారం వరకు వెళ్లి కూడా తప్పించుకురావచ్చు. ఇదే అనిపిస్తుంది ఈ ఘటన గురించి విన్నాక. ఓ వ్యక్తిపైనుంచి రైలు వెళ్లినా అతడికేమీ కాలేదు.

ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఈనెల 15న ఈ ఘటన చోటు చేసుకోగా చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Miracle man walks away unhurt after a goods train passes over him

అసలేం జరిగిందంటే... ఓ వ్యక్తి దేవరియాలోని బన్‌కటా స్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉంది. త్వరగా వెళ్లాలనుకున్న అతను ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై నుంచి కాకుండా, ట్రాక్‌పై ఆగి ఉన్న ఒక గూడ్స్ కింద నుంచి అవతలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా గూడ్స్ కిందకి దూరాడు. ఇంతలో అది ముందుకు కదిలింది. దీంతో విషయం అతనికి అర్థమైపోయింది. చేసేదిలేక ప్రాణాలు ఉగ్గబట్టుకుని ట్రాక్ మధ్యలో అతుక్కుపోయాడు.

ఆ గూడ్స్ ట్రైన్ వెళ్లేంతవరకూ అలానే కదలకుండా ఉన్నాడు. ట్రైన్ వెళ్లిపోయాక లేచి బతుకు జీవుడా అనుకుంటూ అతను వెళ్లిపోయాడు. ఈ ఘటన చూస్తున్నవారంతా అతనికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+