53 ఏళ్ల ఏనుగు విమానమెక్కిన వేళ.. దేశ చరిత్రలోనే తొలిసారి

ఈశాన్య భారతంలో ప్రకృతి కోపానికి, పొంగిపొర్లిన వరద రాకాసికి జీవితం అల్లకల్లోలమైన వేళ.. ఓ మూగజీవం మరణపు అంచుల దాకా వెళ్లి నిలబడింది. 53 ఏళ్ల వయసున్న 'జాయ్‌మతి' అనే ఆడ ఏనుగు వరద ఉధృతిలో కొట్టుకుపోయి సాయం కోసం దిక్కుతోచని స్థితిలో అలమటించింది.అయితే, మానవత్వం ఇంకా చావలేదని నిరూపిస్తూ అటవీ శాఖ, స్థానిక ప్రజలు దాన్ని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. తీవ్ర గాయాలతో రోదిస్తున్న ఆ ఐరావతానికి ఇప్పుడు ఊహించని రీతిలో పునర్జన్మ లభించబోతోంది. అత్యవసర శస్త్రచికిత్సల కోసం ఈ ఏనుగును ఏకంగా ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని అత్యంత ప్రాచుర్యం పొందిన 'వంతారా' ఆసుపత్రికి తరలిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఒక ఏనుగును విమానంలో తరలించడం ఇదే తొలిసారి!

గత జులై నెలలో నాగాలాండ్, అస్సాం ప్రాంతాలను ముంచెత్తిన వరదల్లో జాయ్‌మతి కొట్టుకుపోయింది. ఉద్ధృతంగా పారే నీటి ప్రవాహంలో రాళ్లు, రప్పలు గుద్దుకోవడంతో దాని దేహమంతా క్షతగాత్రమైంది. నడుము, చెవులు, తోక, పొత్తికడుపు భాగాల్లో లోతైన గాయాలయ్యాయి.

అంతకుముందే కలప మోసే పనుల్లో ఒక కాలు విరిగిపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న ఈ ఏనుగు, వరద దెబ్బకు ఒక కంటి చూపును కూడా శాశ్వతంగా కోల్పోయింది. కంటి నుంచి నిరంతరం నీరు కారుతున్నా, అడుగు తీసి అడుగు వేయలేక నరకయాతన అనుభవిస్తున్నా.. ఆ మూగజీవి కళ్లలో జీవించాలనే ఆశ మాత్రం చావలేదు.

Miraculous Rescue Of Joymoti 53-Year-Old Injured Elephant Airlifted To Vantara For Lifesaving Care
ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్
ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్

రోడ్డు ప్రయాణపు నరకం వద్దు.. ఆకాశ మార్గాన 'వంతారా'కు!

గాయపడిన ఏనుగును రోడ్డు మార్గాన వందల కిలోమీటర్లు తీసుకెళ్తే, ఆ ప్రయాణపు నొప్పులను తట్టుకోవడం దాని వల్ల కాదు. ఈ పరిస్థితిని గమనించిన వెటర్నరీ వైద్యులు దాని ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు విమానంలో తరలించడమే సరైన మార్గమని నిర్ణయించారు. అనంత్ అంబానీ నేతృత్వంలోని 'వంతారా' సంస్థ వెంటనే స్పందించి, నిపుణులైన వైద్య బృందం సంరక్షణలో జాయ్‌మతికి ఎలాంటి శ్రమ కలగకుండా ప్రత్యేకంగా సిద్ధం చేసిన విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేస్తోంది. అక్కడ అత్యాధునిక శస్త్రచికిత్సలు, లేజర్ థెరపీ , పౌష్టికాహారంతో దానికి అత్యుత్తమ చికిత్స అందించనున్నారు.

మానవత్వానికి నిదర్శనం.. సొంత ఇంటికి మళ్లీ వస్తుంది!

జాయ్‌మతిని జామ్‌నగర్‌కు తీసుకెళ్లడం శాశ్వత తరలింపు కాదని, కేవలం దాని ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య చికిత్స కోసమేనని అధికారులు స్పష్టం చేశారు. వంతారాలో పూర్తి చికిత్స అందించి, గాయాలు మానిపోయి, అది ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటారు.

World Elephant Day 2021: ప్రకృతికి ఏనుగుల అవసరం ఎందుకు..? భారత్‌లో గజరాజుల పరిస్థితి ఏంటి..?
World Elephant Day 2021: ప్రకృతికి ఏనుగుల అవసరం ఎందుకు..? భారత్‌లో గజరాజుల పరిస్థితి ఏంటి..?

అస్సాం వంటి ప్రాంతాల్లో తరచూ వరదలు, మానవ-వన్యప్రాణి ఘర్షణలు జరుగుతుంటాయి కాబట్టి.. భవిష్యత్తులో ఏ మూగజీవానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అస్సాం అటవీ శాఖ భాగస్వామ్యంతో వంతారా సంస్థ స్థానికంగానే మూడు అధునాతన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎక్కడో వరదల్లో కొట్టుకుపోయిన ఒక ఏనుగు ప్రాణాన్ని కాపాడేందుకు ఆకాశాన్నే మార్గంగా మలచిన ఈ సంఘటన, మూగజీవాలపై మానవాళికి ఉన్న ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+