• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిరాజ్: ‘మ్యూజికల్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరుపొందిన ఈ నగరం ప్రత్యేకత ఏంటంటే...  

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మిరాజ్ నగరం తీగ వాద్యాలకు ప్రసిద్ధి

మహారాష్ట్రలో మిరాజ్ అనేది ఒక చిన్న నగరం. 150 ఏళ్లుగా శాస్త్రీయ సంగీతానికి నగరం ప్రసిద్ధ కేంద్రంగా ఉంది.

ముంబై నగరానికి 400 కి.మీ దూరంలో ఉన్న మిరాజ్ నగరం ఒకప్పటి పట్వర్ధన్ సంస్థానంలో భాగం. అనేక మంది ప్రముఖ శాస్త్రీయ సంగీతకారులకు ఇది నిలయం.

దేశంలో తీగ వాయిద్యాల హబ్‌గా పేరు పొందింది.

మిరాజ్‌లో తయారైన వేలాది సంగీత పరికరాలను ముఖ్యంగా తంబురా, సితార్, సారంగి, వీణ వంటి వాటిని దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఉపయోగిస్తున్నారు.

దేశంలోని చాలామంది అగ్రశ్రేణి సంగీతకారులు ఈ చారిత్రక నగరంలోని దిగ్గజ కళాకారులు ప్రత్యేకంగా రూపొందించిన సంగీత వాయిద్యాలను తెప్పించుకుంటారు.

మిరాజ్
మిరాజ్

సంగీత వాద్యాల తయారీ పరిశ్రమను షికల్‌గర్ కమ్యూనిటీకి చెందిన 50 కుటుంబాల్లోని 300 మంది కళాకారులు నడుపుతున్నారు. ఏడు తరాలుగా వారు ఇదే పని చేస్తున్నారు.

18వ శతాబ్దం నుంచి ఈ వాయిద్యాలను తయారు చేస్తున్నారు.

చారిత్రకంగా షికల్‌గర్లు అనేవారు మరాఠా సామ్రాజ్యం పాలన సమయంలో కత్తులు, ఇతర మిలిటరీ పరికరాల తయారీలో ఆరితేరిన లోహకళాకారులు.

''కానీ 1818లో మరాఠా సామ్రాజ్యం పతనం, ఆ తర్వాత బ్రిటిష్ వారు ఆధునిక ఆయుధాలు వాడటంతో మార్కెట్ క్షీణించింది. దాంతో షికల్‌గర్ కళాకారులు తమ సంప్రదాయ పనికి దూరం కావడం మొదలైంది’’ అని నగరంలోని చరిత్రకారుడు మాన్‌సింగ్ కుమ్తేకర్ చెప్పారు.

మిరాజ్
మిరాజ్

మిరాజ్ నగర సాంస్కృతిక చరిత్ర తర్వాతి కాలంలో మరింత మార్పుకు గురైంది.

మిరాజ్ రాజు శ్రీమంత్ బాలాసాహెబ్ పట్వర్ధన్ 2. ఆయన గొప్ప సంగీత ప్రేమికుడు. తన పాలనా కాలంలో ప్రదర్శనలు ఇవ్వడం కోసం ఉపఖండ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సంగీతకారులను మిరాజ్‌ నగరానికి ఆహ్వానించారు.

సంగీతకారులు తమ వెంట తెచ్చిన సంగీత పరికరాలకు మరమ్మతులు చేయడానికి ఆ కాలంలో ఎవరూ ఉండేవారు కాదని కమ్తేకర్ చెప్పారు.

దీంతో రాజు సహాయం కోసం షికల్‌గర్ కమ్యూనిటీ ప్రజలను ఆశ్రయించేవారని తెలిపారు.

మిరాజ్
మిరాజ్

''సంగీత వాద్యాలకు మరమ్మతులు చేయడంలో సహాయపడగలరా? అని రాజు ఇద్దరు సోదరులైన ఫరీద్‌సాహెబ్, మోయిద్దీన్‌లను అడిగారు.

సంగీత ప్రేమికులైన ఆ సోదరులు ఇద్దరూ సంగీత వాయిద్యాల మరమ్మతులు, తయారీని బాగా నేర్చుకున్నారు. వారిని అందరూ 'సితార్ తయారీ నిపుణులు’ అని పిలవడం మొదలుపెట్టారు’’ అని కుమ్తేకర్ వివరించారు.

త్వరలోనే షికల్‌గర్ కమ్యూనిటీకి చెందిన ఇతర కుటుంబాలు కూడా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. అలా అక్కడ ఈ పరిశ్రమ పురుడు పోసుకుంది.

మిరాజ్ నగరం తీగ వాయిద్యాలకు ప్రసిద్ధి
మిరాజ్ నగరం తీగ వాయిద్యాలకు ప్రసిద్ధి

కానీ శతాబ్ద కాలపు మిరాజ్ సంగీత సంప్రదాయం ఇప్పుడు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఒకప్పుడు వేల మందికి ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమలో ఇప్పుడు కొన్ని వందల మంది మాత్రమే మిగిలిపోయారు.

ఎలక్ట్రానిక్ పరికరాలు, మ్యూజిక్ యాప్‌ల రాక వల్ల ఈ క్రాఫ్ట్‌ను సంరక్షించడం సవాలుగా మారిందని కళాకారులు అంటున్నారు. తమ జీవనోపాధిని కోల్పోయేలా చేసిందని ఆవేదన చెందుతున్నారు.

వీరిలో కొంతమంది నూతన టెక్నాలజీకి మారారు. మిగతావారు సంప్రదాయ వృత్తిని కాపాడుకోవాలనే పట్టుదలతో ఇందులోనే కొనసాగుతున్నారు.

తమ భవిష్యత్ గురించి ఆందోళనగా ఉందని వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Miraj: Known as the 'Musical City of India', this city is unique because...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X