రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు కాదు- ఉద్యోగ నియామకాల నుంచి గెంటేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన

జైపూర్: దేశంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంటోంది. ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. సెప్టెంబర్/అక్టోబర్‌లల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్/జనవరి నాటికి ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

Miscreants will be banned from government jobs in Rajasthan

రాజస్థాన్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఇప్పటికే అనేక హామీలను ప్రకటించిందా పార్టీ. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది రాజస్థాన్ ప్రభుత్వం. మహిళలు, యువతులు, మైనర్లపై అత్యాచారాలు, లైంగిక వేధింపులను అరికట్టే దిశగా ఈ నిర్ణయం వెలువడింది.

అత్యాచార నిందితులు, లైంగిక వేధింపులకు పాల్పడే వారిని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల నుంచి నిషేధించింది రాజస్థాన్ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొద్దిసేపటి కిందటే ఈ ప్రకటన చేశారు. దీన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అన్నారు.

అత్యాచారాలకు పాల్పడినా.. అత్యాచారం చేయడానికి ప్రయత్నించినా.. మహిళలను లైంగికంగా వేధించినా.. వారిపై లైంగిక దాడులకు పాల్పడినా.. ఈ నిషేధం వర్తిస్తుంది. ఆయా పోలీస్ స్టేషన్లల్లో హిస్టరీ షీట్లను వారిపై ఓపెన్ చేస్తారు పోలీసులు. హిస్టరీ షీట్ల తరహాలోనే ప్రత్యేకంగా రేపిస్టుల కోసం కొత్తగా రికార్డులను తెరుస్తారు.

ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ రికార్డులను పోలీసులు పరిశీలిస్తారు. అందులో పేరు ఉంటే.. ఆ వ్యక్తి దాఖలు చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరిస్తుంది. ఆ సమయంలో అతణ్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది పోలీసులకు. మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశోక్ గెహ్లాట్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+