ప్రధాని మోడీని కలిసిన మిస్ వరల్డ్ మానుషి చిల్లర్
న్యూఢిల్లీ: ఇటీవల ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తల్లిదండ్రులతో కలిసి ఆమె ప్రధానిని కలిశారు.
మోడీతో మానుషి చిల్లర్, ఆమె కుటుంబ సభ్యులు ఫోటోలు తీసుకున్నారు. మానుషి చిల్లర్ బుధవారం హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌కు హాజరైన విషయం తెలిసిందే.

అంతకుముందు ఆమె ట్వీట్ చేశారు. తాను చాలా ఆత్రుతగా ప్రధానిని కలిసేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రధాని మోడీని కలుస్తున్నందుకు గర్వంగా ఉందని, ఆయన అందరికీ ఆదర్శం అన్నారు.












Click it and Unblock the Notifications