వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా సంక్షోభం: పీఎస్‌లో కంప్లైంట్ చేసిన ఎమ్మెల్యే భార్య.. ప్రాణహానీ అంటూ..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. శివసేన నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగబాటు ఎగరవేశారు. 21 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గుజరాత్ వెళ్లారు. సూరత్‌లో గల మెరేడియన్ హోటల్‌లో బస చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అతనని సముదాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే షిండేతో వెళ్లిన ఒక ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ గురించి అతని భార్య ఆందోళన వ్యక్తం చేసింది.

దేశ్‌ముఖ్ కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతని ప్రాణాలకు ఆపాయం ఉందని పేర్కొంది. ఈ మేరకు అకొలా పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. భర్త నిన్న రాత్రి 7 గంటలకు తనతో చివరిసారిగా మాట్లాడారని వివరించారు. తర్వాత తనతో మాట్లాడలేదని చెప్పారు. భర్త ఫోన్ ఇప్పటికీ స్విచాప్ వస్తుందని తెలియజేసింది. దీంతో తనకు అనుమానం కలుగుతుందని వివరించింది. అయితే అతనికి అనారోగ్యంగా ఉండటంతో సూరత్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు సమాచారం.

Missing, Alleges Wife Of Sena MLA Camping In Gujarat

22 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావించి ఉంటారు. శివసేనకు చెందిన 22 ఎమ్మెల్యేలతోపాటు 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెబుతున్నారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాకూటమి, విపక్ష బీజేపీ చెరో 5 సీట్లు గెలుచుకున్న గంటల వ్యవధిలో ఈ పరిణామం జరిగింది. బీజేపీ పోటీ చేసిన 5 చోట్ల విజయం సాధించింది.

అధికార శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ పార్టీకి ఇబ్బందులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. శివసేనకు చెందిన ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండే పార్టీ విస్తరణలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ పబ్లిక్ వర్క్స్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కొడుకు డాక్టర్ శ్రీకాంత్ షిండే ప్రస్తుతం కల్యాన్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.

English summary
Shiv Sena MLA Nitin Deshmukh wife has filed a missing complaint in the police station. She suspects a threat to his life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X