రేప్: కేంద్రమంత్రి కనిపించట్లేదని.., ఢిల్లీలో కనిపించారు!

అయితే, నిహాల్ చంద్ మేఘ్‌వాల్ మంగళవారం ఉదయం ఢిల్లీలో కనిపించారు. ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన కోర్టుకు హాజరు కాకపోవడమే కాకుండా, ఆయన ఎక్కడున్నది తమకు తెలియదని పోలీసులు చెప్పడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
మహిళ పైన అత్యాచారం కేసులో 16 మందితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నిహాల్ చంద్ మేఘ్‌వాల్ ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. కొత్తగా మంత్రివర్గ విస్తరణల అనంతరం ఆయన శాఖను మార్చారు. అంతకుముందు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రిగా ఉన్న ఆయనను పంచాయతీరాజ్‌కు మార్చారు. ఇతను మంగళవారం తన కొత్త శాఖ ఛార్జ్ తీసుకోనున్నారు. కాగా, నిహాల్ చంద్ మేఘ్‌వాల్‌ను తొలగించాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
2012లో రాజస్థాన్ పోలీసులు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేశారు. అనంతరం కేసును మూసేశారు. అనంతరం ఆమె కోర్టుకు వెళ్లారు. అందులో ఆమె నిహాల్ చంద్ మేఘ్‌వాల్‌తో పాటు పలువురి పైన ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు వారికి సమన్లు పంపించింది.
ఈ ఏడాది ఆగస్టులో అతను కోర్టులో హాజరు కావాల్సి ఉండె. అయితే, అతను ఢిల్లీలో ఉంటున్నందున పోలీసులు అతనికి సమన్లు ఇవ్వలేకపోయారు. ఇదే విషయాన్ని పోలీసులు కోర్టుకు చెప్పారు. దీంతో, కోర్టు అతను సమన్లు తీసుకునేలా చూడాలని సూపరిండెండెంట్ ఆఫ్ పోలీసును ఆదేశించింది.
నిహాల్ చంద్ మేఘ్‌వాల్ పలుమార్లు తన నియోజకవర్గమైన గంగానగర్‌లో పర్యటిస్తుంటారు. అక్టోబర్ 19వ నియోజకవర్గానికి వచ్చి ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఎక్కడున్నారో తెలియదని పోలీసులు చెప్పడం సరికాదని చెబుతున్నారు. కాగా, రేపు (బుధవారం) ఆయన కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications