మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయ‌కుండా వెనుదిరిగినా మిజోరం సిఎం..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షూర్ అయ్యింది. ఈ రోజు మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. అయితే, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభ‌మైంది. ఈ పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వ‌ర‌కు మాత్ర‌మే కొన‌సాగుతుంది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరం సిఎం ఓటు వేయ‌కుండానే వెనుదిరిగారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం చేరుకున్న మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగాకు చేదు అనుభవం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో మిజోరం ముఖ్య‌మంత్రి ఓటు వేయ‌లేక‌పోయారు. త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోకుండానే అక్క‌డినుంచి వెనుదిరిగారు. అయితే ఆయన మధ్యాహ్నం ఆయ‌న త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు తిరిగి పోలింగ్‌బూత్‌కు రానున్నట్టుగా స‌మాచారం.

Mizoram CM turned away from voting.

మాకు ఏ పార్టీతో పొత్తులు లేవు : అయితే, పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి మాట్లాడారు. ఓటింగ్ మిషన్ పనిచేయకపోవడంతో కొంత సమయం ఓటింగ్ హాల్‌లో ఉన్నాను. అయినప్పటికీ, మిషిన్ పనిచేయలేదు. దీంతో ఓటింగ్ హాల్ నుంచి వెనుదిరిగి వచ్చేసాను. మళ్లీ వచ్చి ఓటును వేస్తాననని ఆయ‌న చెప్పారు. మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఉండదని, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సిఎం చెప్పారు. అయితే, ఇక్క‌డ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు 21 సీట్లు కావాలని, తమకు 25 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని మేము ఆశిస్తున్నామని ముఖ్య‌మంత్రి అన్నారు. 'రాష్ట్రంలో బిజెపితో కానీ మరే ఇతర పార్టీతో కానీ త‌మ‌కు పొత్తులు లేవ‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. ఇప్పటివరకు వాళ్లు మమ్మల్ని సంప్రదించలేదు. మేం వాళ్లను సంప్రదించలేదు అని అన్నారు.

డిసెంబర్ 3న కౌంటింగ్‌ : ఈ ఎన్నిక‌ల కౌంటింగ్‌ డిసెంబర్ 3న జరగనుంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనుంది. ఇక్క‌డ‌ మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిజోరం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895 కాగా, వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఉన్నారు. మిజోరంలో మొత్తం 4,973 సర్వీస్ ఓటర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+