2 వేల పింఛను, సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్..: మిజోరం కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే

ఐజ్వాల్: కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మిజోరం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. సబ్సిడీతో ఎల్‌పిజి సిలిండర్లు, నెలకు రూ. 2,000 వృద్ధాప్య పింఛను, రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీతో సహా పలు ఇతర సంక్షేమ పథకాలు, హామీలను ఇస్తూ మిజోరంలో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం తన మేనిఫెస్టోను వెల్లడించింది.

ఈశాన్య రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. సమర్థత, పారదర్శకత, అవినీతిని ఎదుర్కోవడానికి నిబద్ధతపై దృష్టి సారించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మిజోరాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) ప్రధాన అధికార ప్రతినిధి రోనాల్డ్ సప ట్లై స్థానిక ప్రజాస్వామ్యాన్ని సాధికారపరచడానికి పార్టీ నిబద్ధతను నొక్కి చెబుతూ మేనిఫెస్టోను ప్రకటించారు.

'గ్రామ సభలు, స్థానిక సంస్థలకు మరింత అధికారం, బాధ్యతలు, ఆర్థిక వనరులను ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది' అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మెరుగైన కనెక్టివిటీ, విమానాశ్రయాలు, విద్యుత్‌తో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆవశ్యకతను కూడా మేనిఫెస్టో నొక్కి చెప్పింది.

Mizoram Polls: Congress Promises Subsidised LPG Cylinders, Old-Age Pension, Health Insurance In Manifesto

రైతులు, పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో, కాంగ్రెస్ ప్రభుత్వం "యంగ్ మిజో ఎంట్రప్రెన్యూర్స్ ప్రోగ్రాం (YmElevate)"ని ప్రతిపాదించింది. ఇందులో స్టార్టప్ ఫండింగ్, మిజో యువకులకు 100,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యం పెట్టుకుంది. అదనంగా, ప్రభుత్వ ఉద్యోగులు లేని కుటుంబాలకు రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని కల్పిస్తామని మ్యానిఫెస్టో హామీ ఇచ్చింది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల కోసం 5 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని ANI నివేదిక పేర్కొంది. వృద్ధాప్య పింఛను నెలకు రూ.2 వేలకు పెంచుతామన్నారు. అంత్యోదయ అన్న యోజన (AAY), ప్రాధాన్యత గల గృహ (PHH) కార్డుదారులకు, అలాగే మహిళా ప్రధాన కుటుంబాలకు సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.750కి అందుబాటులో ఉంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టో వెల్లడించింది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వితంతువులు, వికలాంగులకు నెలకు రూ. 2,000 సహాయాన్ని పెంచడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నివేదిక పేర్కొంది.

మిజోరంలో ముగిసిన నామినేషన్లు

మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడించారు. నవంబర్ 7న ఒకే దశలో జరగనున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.

ఐదు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో దించగా.. 27 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన 174 మంది అభ్యర్థుల్లో 16 మంది మహిళలు ఉన్నారని మిజోరం అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ లియాంజెలా తెలిపారు.

2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. అక్టోబర్ 21న నామినేషన్ల పరిశీలన జరగ్గా.. ఉపసంహరణ గడువు ఈ నెల 23తో ముగిసింది. నవంబర్ 7న పోలింగ్ నిర్వహించి.. మిగతా నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,56,868 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా, అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), ప్రధాన ప్రతిపక్షం జడ్పీఎం, కాంగ్రెస్ మొత్తం 40 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 23 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+