విజయ్ తాజా మంత్రాంగం, స్టాలిన్ అలర్ట్.. కీలక ఆదేశాలు - మన స్టాండ్ ఇదే..!!
తమిళనాట రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎగ్జిట్ పోల్స్ తో లెక్కలు మారుతున్నాయి. ఇక, విజయ్ క్యాంప్ అలర్ట్ అయింది. డీఎంకే కు అధికారం ఖాయమని.. మెజార్టీ సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. అదే సమయంలో విజయ్ కు దక్కే సీట్ల పైన లెక్కలు భిన్నంగా వచ్చాయి. పోలింగ్ రోజు నుంచి విజయ్ కు యువత.. మహిళలు మద్దుతుగా నిలిచినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం సాగిస్తున్నారు. అటు పార్టీ నేతలకు సీఎం స్టాలిన్ కీలక సూచనలు చేసారు.
తమిళనాడు లో ఎగ్జిట్ పోల్స్ తో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మెజారిటీ సర్వేలు అధికార డీఎంకే కూటమికే మరోసారి పట్టం కట్టినప్పటికీ, ఎన్డీటీవీ-యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం ఊహించని విశ్లేషణను తెరపైకి తెచ్చింది. మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే ఏకంగా 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, అదే సమయంలో డీఎంకే కూటమి 92-110 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం గా మారింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. తమిళ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు విజయ్ పార్టీ చుట్టూ తిరుగు తోంది. డీఎంకే మాత్రం అధికారం తమదే అనే ధీమాతో ఇప్పటికీ ఉంది. అయినా.. ఫలితాలకు ముందే అవసరమైన వ్యూహాలు సిద్దం చేస్తోంది. హంగ్ కు అవకాశం లేదని చెబుతున్నా... ఫలితం ఎలా ఉన్నా.. తమ పట్టు చే జారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

తమిళనాట వేగంగా మారుతున్న పరిణామాలు
ఇదే సమయంలో సీఎం స్టాలిన్ పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. కౌంటింగ్ రోజున చివరి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే వరకూ కౌంటింగ్ కేంద్రాలను వదిలి రావద్దని తేల్చి చెప్పారు. విజయ్ తన పార్టీ ముఖ్యులు.. రాజకీయ సన్నిహితులతో మంత్రాంగం సాగిస్తున్న వేళ స్టాలిన్ అలర్ట్ అయ్యారు. కొన్ని సర్వేలు చెప్పినట్లు విజయం మేజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చి ఆగిపోతే.. మద్దతు కీలకం కానుంది. అటు విజయ్ సైతం ఇదే అంశం పైన మంత్రాంగం సాగిస్తున్నారు. ఎవరి మద్దతు తీసుకోవాలి.. ఎలా ముందుకెళ్లాలనే అంశాల పైన చర్చలు చేస్తున్నారు. అన్నా డీఎంకే కూటమి ఫలితాల తరువాత మాత్రమే తమ వైఖరి స్పష్టం చేయాలని భావిస్తోంది. డీఎంకే ఇప్పటికే కీలక నేతల సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హంగ్ పరిస్థితులు ఏర్పడితే.. మరో పార్టీ మద్దతు తీసుకోకూడదని.. అదే విధంగా తాము ఎవరికీ మద్దతు ఇచ్చే అవకాశం లేదని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. దీంతో.. తమిళనాడులో ఫలితాల వేళ నెంబర్ గేమ్ రాజకీయంగా ఉత్కంఠ ను పెంచుతోంది.













Click it and Unblock the Notifications