వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్, శశికళకు నార్కో అనాలసీస్ పరీక్షలు: జయ మృతిపై డిమాండ్ !

శశికళ, పన్నీర్ సెల్వం, పీహెచ్. పాండియన్, పొన్నయ్యన్, దిండుగల్ శ్రీనివాసన్, సెంగోట్టయ్యన్, తమినాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్ రావు, రాధకృష్ణన్ కు నార్కో అనాలసీస్ పరీక్షలు నిర్వహిస్తే జయ

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తాజాగా వెలువడుతున్న వైద్య నివేదికలు చూస్తుంటే వినోదం, విడ్డూరంగా ఉన్నాయని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విమర్శించారు.

అసలు ఈ నివేదికలో ఏవి నిజాలు, ఏవి అపద్దాలు అని అందరినీ అయోమయానికి గురి చేస్తున్నాయని పీఎంకే నేత రాందాసు సైతం మండిపడుతున్నారు. జయలలిత మరణంపై విడుదలైన వైద్య నివేదికలపై స్టాలిన్, రాందాస్ వేర్వేరు ప్రకటనలలో తమిళనాడు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

ఎవరి మాటలు నిజం ?

ఎవరి మాటలు నిజం ?

జయలలిత మరణంపై శశికళ, పన్నీర్ సెల్వం శిబిరాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ అనుమానాలు నివృతి చెయ్యాల్సిన అవసరం ఉందని స్టాలిన్, రాందాస్ డిమాండ్ చేస్తున్నారు. జయలలిత ముఖ్యమంత్రి స్థాయిలో అనుమానాస్పద స్థితిలో మరణించారని ప్రజలు ఆరోపిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

నార్కో అనాలసీస్ పరీక్షలు నిర్వహించాలి

నార్కో అనాలసీస్ పరీక్షలు నిర్వహించాలి

జయలలిత మరణంపై పరస్పర ఆరోపణలు చేస్తూ శశికళ, పన్నీర్ సెల్వం వర్గం ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని స్టాలిన్, రాందాస్ మండిపడ్డారు. శశికళ, పన్నీర్ సెల్వం, పీహెచ్. పాండియన్, పొన్నయ్యన్, దిండుగల్ శ్రీనివాసన్, సెంగోట్టయ్యన్, ఆరోగ్య శాఖా మంత్రి, తమినాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్ రావు, ఆరోగ్య శాఖా కార్యదర్శి రాధకృష్ణన్ కు నార్కో అనాలసీస్ పరీక్షలు నిర్వహించాలని అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్టాలిన్, రాందాస్ డిమాండ్ చేస్తున్నారు.

అమ్మకు 30 మంది వైద్యుల చికిత్స

అమ్మకు 30 మంది వైద్యుల చికిత్స

జయలలితకు 30 మంది వైద్యులు ఉన్నతమైన చికిత్స అందించినట్లు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తమిళనాడు విభాగం అధ్యక్షుడు డాక్టర్ రవి శంకర్ తెలిపారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ది చెందిన వైద్యులు, అపోలో వర్గాలు జయలలితకు ఉన్నత వైద్యాన్ని అందించారని వివరించారు.

ఇన్ని రోజులు ఎక్కడికి పోయారంటూ ?

ఇన్ని రోజులు ఎక్కడికి పోయారంటూ ?

జయలలిత మరణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉపవాస సత్యాగ్రహం చేసే సమయంలోనే అమ్మ చికిత్సకు సంబంధించిన వివరాలు చెబుతున్న వారు ఇన్ని రోజులు ఎక్కడికిపోయారని ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు మండిపడుతున్నారు.

English summary
Apollo Hospitals released a medical bulletin stating that Jayalalithaa was admitted there following fever and nutrition deficiency. But the AIIMS statement states that Jayalalithaa was unconscious and on life support when she was admitted to hospital on September 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X