జయ మృతి మిస్టరీ ఏంటో ? సిట్టింగ్ జడ్జితో విచారణ: స్టాలిన్
చెన్నై: జయలలితకు 74 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో జరిగిన చికిత్స ఏమిటి ? ఆమె ప్రాణాలు పోయేలా దారితీసిన అనారోగ్య పరిస్థితులు ఏమిటి ? చికిత్స సమయంలో జయ పోటో లేదా వీడియో ప్రజలకు ఎందుకు విడుదుల చెయ్యలేదు ? తదితర అనుమానాలపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులు నిలదీస్తున్నారు.
జయలలిత మృతిపై వ్యక్తిగతంగా మాకు అనుమానాలు ఉన్నాయని మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ చెప్పడంతో ఇప్పుడు ఆయనకు పలువురు ప్రతిపక్ష నాయకులు ఆండగా నిలవడంతో పాటు జయ మృతిపై విచారణకు పట్టుబడుతున్నారు.
హై కోర్టు న్యాయమూర్తి (సిట్టింగ్ జడ్జి) నేతృత్వంలో జయలలిత ఎలా మృతి చెందారు ? ఆ మిస్టరీ ఏంటో ? అని విచారణ జరిపించాలని తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ కోశాధికారి ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.

జయలలిత ఎలా మరణించారు అని విచారణ వేగవంతంగా పూర్తి చేసి ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను తొలగించాలని స్టాలిక్ కోరారు. జయలలిత ఎలా మృతి చెందారు అనే విషయం తెలుసుకోవాలని చాల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని ఇదే సమయంలో స్టాలిన్ గుర్తు చేశారు.
జయలలిత ఎలా మృతి చెందారు అనే విషయంలో వివరణ ఇస్తూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయ్యాలని తాము మనవి చేశామని, అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్భుమణి రాందాస్ మండిపడ్డారు. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని తమిళనాడు ప్రభుత్వాన్నిహెచ్చరించారు.












Click it and Unblock the Notifications