MK Stalin: వెంటనే పిల్లల్ని కనండి.. తమిళ ప్రజలకు ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి
MK Stalin: తమిళనాడు ప్రజలు వెంటనే పిల్లలను కనాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ చర్యలు ఇప్పుడు ప్రతికూల స్థితిలోకి నెట్టాయని చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ణయిస్తే.. రాష్ట్రంలో లోక్ సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయని స్టాలిన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన సీఎం స్టాలిన్.. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు వెంటనే పిల్లల్ని కనాలని సీఎం ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జనాభాను విజయవంతంగా నియంత్రించడం వల్ల కలిగే పరిణామాలను ఇప్పుడు రాష్ట్రం అనుభవించాల్సి రావచ్చన్నారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ప్రకటనలో.. "గతంలో మీరు మీ తీరిక సమయంలో పిల్లలను కనాలని చెప్పాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పెళ్లయిన జంటలు వెంటనే పిల్లలను కనాలి." అని స్టాలిన్ అన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే తమిళనాడులో లోక్‌సభ సీట్ల సంఖ్య, పార్లమెంట్ లో రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని సీఎం అన్నారు. పునర్విభజన అంశంపై మార్చి 5న స్టాలిన్ అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను మరచిపోయి సమావేశానికి హాజరు కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పునర్విభజన అంశం తమిళనాడుకు చాలా ముఖ్యమైనదని అన్నారు. లోక్ సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ పనులను కేంద్రం 2026లో చేపట్టనున్న నేపథ్యంలో జనాభా ఆధారంగా జరిగితే రాష్ట్రానికి 8 నియోజకవర్గాల వరకు తగ్గుతాయని ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది సీట్ల సంఖ్య పెరుగుతుందని.. దక్షిణాది రాష్ట్రాలు దానిని వ్యతిరేకిస్తున్నాయి.

பிரதமர் அவர்களே… எங்களுக்கு எழுத்துப்பூர்வமாக உறுதிகொடுங்கள்!#தமிழ்_வாழ்க #FairDelimitationForTN pic.twitter.com/mafR2DOIxa
— M.K.Stalin (@mkstalin) March 2, 2025
అంతకు ముందు తన 72వ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి తన పార్టీ కేడర్ కు విజ్ఞప్తి చేస్తూ..తమిళనాడు రెండు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోందని.. వీటిలో ఒకటి భాషా పోరాటమని.. మరొకటి పునర్విభజన అంశమని.. ఇది మన హక్కు అని పేర్కొన్నారు. ఈ పోరాటం గురించి ప్రజలకు చెప్పాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. పునర్విభజన రాష్ట్ర ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమ పథకాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు రాష్ట్రాన్ని కాపాడటానికి ఐక్యంగా ఉండేలా మీరు ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.












Click it and Unblock the Notifications