MLA: ఎమ్మెల్యే రొమాన్స్ కేసు, మాటమీద ఉంటాను, మహిళ, ఎమ్మెల్యేకి సిటీ పోలీసు కమీషనర్ షాక్, ట్విస్ట్ !
బెంగళూరు: నా భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత నువ్వే నా రెండో భార్య అంటూ బీజేపీ ఎమ్మెల్యే నాతో కాపురం చేశాడని, నా బిడ్డకు ఆయనే తండ్రి అని, నాకు న్యాయం చెయ్యాలని అడిగితే ఇప్పుడు ఎదురు తిరిగి చంపేస్తాను అని బెదిరిస్తున్నాడని వివాహిత మహిళ ఆ ఎమ్మెల్యే మీద బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికో పుట్టిన బిడ్డకు తాను తండ్రి అని ప్రచారం చేస్తానని కిలాడీ లేడీ బ్లాక్ మెయిల్ చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. తాను అడిగినన్ని కోట్ల రూపాయలు ఇవ్వకుంటే నా దగ్గర ఉన్న నీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వివాహిత మహిళ, మరి కొందరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బెంగళూరులో ఆమె మీద కేసు పెట్టడం కలకలం రేపింది. ఇదే కేసులో మహిళను మూడు గంటల పాటు విచారణ చేసిన పోలీసు అధికారులు ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ను కలవడానికి వెళితే సిటీ పోలీసు కమీషన్ ఆ ఎమ్మెల్యేను కలవకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆ మహిళ కేసు వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అంటూ ఆయన అనుచరులు ఇప్పుడు టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే
కర్ణాటకలోని సేడం నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల తోల్కుర్ అలియాస్ రాజ్ కుమార్ సొంత పార్టీలో, స్థానిక నియోజక వర్గ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు పుట్టిన బిడ్డకు అధికార పార్టీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ తండ్రి అని 40 ఏళ్ల వివాహిత మహిళ ఆరోపిస్తున్నది. తన భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత నువ్వే నా రెండో భార్య అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ నాతో కాపురం చేశాడని, నా బిడ్డకు ఆయనే తండ్రి అని, నాకు న్యాయం చెయ్యాలని ఆమె బెంగళూరు నగరంలోని విధాన సౌద పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ మీద కేసు పెట్టింది.

లేడీ మీద రివర్స్ కేసు పెట్టిన ఎమ్మెల్యే
ఎవరికో పుట్టిన బిడ్డకు తాను తండ్రి అని ప్రచారం చేస్తానని కిలాడీ లేడీ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే నా దగ్గర ఉన్న నీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వివాహిత మహిళ, మరి కొందరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ బెంగళూరులోని విధాన సౌధ పోలీస్ స్టేషన్ లో ఆమె మీద రివర్స్ కేసు పెట్టాడు.

లేడీని విచారణ చేసిన పోలీసు అధికారులు
బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ కేసు పెట్టడంతో బ్యూటీషియన్ మహిళను విధాన సౌధ పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి మూడు గంటల పాటు ఆమెను విచారణ చేసి వివరాలు సేకరించారు. బీజేపీ ఎమ్మెల్యే తనకు చిన్ననాటి స్నేహితుడని, పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేసి మరో బిడ్డకు తల్లిని చేశాడని, తాను ముందు చేసిన ఆరోపణలకే కట్టుబడి ఉన్నానని బాధితురాలు పోలీసులకు చెప్పిందని తెలిసింది.

మాటమీద ఉంటానని చెప్పిన లేడీ
కొన్ని గంటల పాటు మహిళను విచారణ చేసిన బెంగళూరులోని విధాన సౌధ పోలీసు అధికారులు మళ్లీ అవసరం అయితే విచారణకు పిలుస్తామని చెప్పి ఆమెను ఇంటికి పంపించేశారు. అయితే తాను బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ మీద చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆమె మీడియాకు చెప్పింది. మహిళను విచారణ చేసి వివరాలు సేకరించాలని పోలీసు అధికారులు యలహంక ఉప విభాగం ఏసీపీకి సూచించారని తెలిసింది.
Recommended Video

ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన సిటీ పోలీసు కమీషనర్
మహిళ కేసు పెట్టడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ ను కలవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో చాలా బిజీగా ఉండటం వలన కలవలేకపోతున్నానని సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ సమాచారం ఇవ్వడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆయన్ను కలిసి వివరాలు చెప్పకుండా ఒట్టి చేతులతో అక్కడి నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్











Click it and Unblock the Notifications