MLA: హిజాబ్ వివాదం, చంపేస్తామని బెదిరిస్తున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యే ఫిర్యాదు, గన్ మెన్ లు !

బెంగళూరు/ఉడిపి: హిజాబ్ వివాదం మొదలైన ఉడిపిలో ఇప్పుడు రాజకీయంగా ఒకవర్గం మీద మరో వర్గం విమర్శలు చేసుకుంటున్నాయి. తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా కర్ణాటక హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. నిన్ను అంతం ఎలా చెయ్యాలో మాకు బాగా తెలుసు, త్వరలో నీ అంతు చూస్తామని నన్ను ఇమెయిల్ ద్వారా బెదిరిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రఘపతి భట్ హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి గన్ మెన్ లు ఇస్లామని హోమ్ మంత్రి అన్నారు. అయితే తనకు గన్ మెన్ లు అవసరం లేదని, నాకు నా ప్రజలు, అభిమానులు రక్షణగా ఉంటారని అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు. కర్ణాటకలోని ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ ప్రభుత్వ కాలేజ్ లో ఎక్కువగా పెత్తనం చేస్తున్నారని, ఆయన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు అమ్మాయిలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆరోపించారు. ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆడినట్లు ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆడుతున్నారని ముస్లీం అమ్మాయిల కుటుంబ సభ్యులు ఇప్పటికే మండిపడ్డారు.

Recommended Video

    Hijab పై SC సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు Supreme Court On Hijab Hearing | Oneindia Telugu

     ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్

    ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్

    ఉడిపి ఎమ్మెల్యే రఘపతి భట్ హిజాబ్ విషయంలో ఓ వర్గం వారిని రెచ్చగోట్టే విదంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన కారణంగా హిజాబ్ గొడవలు ఎక్కువ అయ్యాయని ఆ కాలేజ్ లో చదువుతూ హైకోర్టును ఆశ్రయించిన అస్రఫ్ శిఫా ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్, ఆయన అనుచరులు ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇటీవల అస్రఫ్ శిఫా మండిపడ్డారు.

     ఇంత జరగడానికి ఎమ్మెల్యేనే కారణం ?

    ఇంత జరగడానికి ఎమ్మెల్యేనే కారణం ?

    కర్ణాటకలోని ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ ప్రభుత్వ కాలేజ్ లో ఎక్కువగా పెత్తనం చేస్తున్నారని, ఆయన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు అమ్మాయిలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆరోపించారు. ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆడినట్లు ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆడుతున్నారని ముస్లీం అమ్మాయిల కుటుంబ సభ్యులు ఇప్పటికే మండిపడ్డారు.

     చంపేస్తామని బెదిరిస్తున్నారు

    చంపేస్తామని బెదిరిస్తున్నారు

    తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్రకు ఫిర్యాదు చేశారు. నిన్ను అంతం ఎలా చెయ్యాలో మాకు బాగా తెలుసు, త్వరలో నీ అంతు చూస్తామని నన్ను ఇమెయిల్ ద్వారా బెదిరిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రఘపతి భట్ హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్రకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి గన్ మెన్ లు ఇస్లామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు.

     ఎస్ డీపీఐ నాయకుల పనే ?

    ఎస్ డీపీఐ నాయకుల పనే ?

    అయితే తనకు గన్ మెన్ లు అవసరం లేదని, నాకు నా ప్రజలు, అభిమానులు రక్షణగా ఉంటారని అధికార పార్టీ ఎమ్మెల్యే రఘుపతి భట్ అంటున్నారు. ఎస్ డీపీఐ నాయకులు తనను టార్గెట్ చేసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ ఆరోపించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజకీయ లబ్ది కోసం, హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం మా మీద బురద చల్లుతున్నారని ఉడిపి జిల్లా ఎస్ డీపీఐ జిల్లా అధ్యక్షుడు నజీ ఆరోపిస్తున్నారు.

     బుర్కాల కోసం అయితే కాలేజ్ కు రావద్దు

    బుర్కాల కోసం అయితే కాలేజ్ కు రావద్దు

    ఇటీవల ఉడిపి ఎమ్మెల్యే ప్రభుత్వ కాలేజ్ లో జరిగిన విద్యార్థుల కుటుంబ సభ్యుల సమావేశంలో ఎవ్వరూ కూడా హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు రాకూడదని చెప్పారు. మీరు కచ్చితంగా హిజాబ్ లు వేసుకుని వస్తామని పట్టుపట్టకూడదని, మీరు హిజాబ్ లు వేసుకుని వస్తామంటే కుదరని, అలాగైతే కాలేజ్ నిలిపేసి ఇంట్లో ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రఘపతి భట్ సంచలన వ్యాఖ్యలు చేశారని కన్నడ మీడియా తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+