MLA: నా బిడ్డకు తండ్రి ఎమ్మెల్యే, బ్యూటీషియన్, రూ. 2 కోట్ల కోసం ఫోటోలు, వీడియోతో బ్లాక్ మెయిల్ !

బెంగళూరు: అధికార పార్టీ ఎమ్మెల్యే దెబ్బతో మరోసారి కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. తనకు పుట్టిన బిడ్డకు అధికార పార్టీ ఎమ్మెల్యే తండ్రి అని ఓ వివాహిత మహిళ ఆరోపిస్తున్నది. తన భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత నువ్వే నా రెండో భార్య అంటూ బీజేపీ ఎమ్మెల్యే నాతో కాపురం చేశాడని, నా బిడ్డకు ఆయనే తండ్రి అని, నాకు న్యాయం చెయ్యాలని అడిగితే ఇప్పుడు ఎదురు తిరిగి చంపేస్తాను అని బెదిరిస్తున్నాడని వివాహిత మహిళ ఆరోపిస్తున్నది. తన భర్తతో తాను ఎప్పుడో విడాకులు తీసుకుని బీజేపీ ఎమ్మెల్యేతో కాపురం చేశానని బ్యూటీషియన్ లేడీ ఆరోపిస్తున్నది. ఎవరికో పుట్టిన బిడ్డకు తాను తండ్రి అని ప్రచారం చేస్తానని కిలాడీ లేడీ బ్లాక్ మెయిల్ చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే నా దగ్గర ఉన్న నీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వివాహిత మహిళ, మరి కొందరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే కేసు పెట్టడం కలకలం రేపింది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఆ మహిళ మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె పెట్టిన కేసు విచారణలో ఉందని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

 అధికార పార్టీ ఎమ్మెల్యే

అధికార పార్టీ ఎమ్మెల్యే

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని సేడం నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల తోల్కుర్ అలియాస్ రాజ్ కుమార్ సొంత పార్టీలో, స్థానిక నియోజక వర్గ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సేడం నియోజక వర్గంలో బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ కు సొంత బలగం, అనుచరులు ఉన్నారు.

 నా బిడ్డకు రాజ్ కుమార్ తండ్రి

నా బిడ్డకు రాజ్ కుమార్ తండ్రి

తనకు పుట్టిన బిడ్డకు అధికార పార్టీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ తండ్రి అని 40 ఏళ్ల వివాహిత మహిళ ఆరోపిస్తున్నది. తన భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత నువ్వే నా రెండో భార్య అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ నాతో కాపురం చేశాడని, నా బిడ్డకు ఆయనే తండ్రి అని, నాకు న్యాయం చెయ్యాలని ఆమె బెంగళూరు నగరంలోని విధాన సౌద పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ మీద కేసు పెట్టింది.

 నాకు అన్యాయం చేస్తున్నాడు: బ్యూటీషియన్

నాకు అన్యాయం చేస్తున్నాడు: బ్యూటీషియన్

అడిగితే ఇప్పుడు ఎదురు తిరిగి చంపేస్తాను అని బెదిరిస్తున్నాడని వివాహిత మహిళ ఆరోపిస్తున్నది. నా కడుపులో పుట్టిన బిడ్డకు, నాకు న్యాయం చెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ను అడిగితే ఇప్పుడు ఆయన తనకు ఎదురు తిరిగి ఎక్కువ మాట్లాడదితే చంపేస్తాను అని బెదిరిస్తున్నాడని వివాహిత మహిళ విదాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో తాను ఎప్పుడో విడాకులు తీసుకుని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ తో కాపురం చేశానని బ్యూటీషియన్ లేడీ ఆరోపిస్తున్నది

 రూ. 2 కోట్ల కోసం బ్లాక్ మెయిల్..... కౌంటర్ కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే

రూ. 2 కోట్ల కోసం బ్లాక్ మెయిల్..... కౌంటర్ కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే

ఎవరికో పుట్టిన బిడ్డకు తాను తండ్రి అని ప్రచారం చేస్తానని కిలాడీ లేడీ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆరోపిస్తున్నారు. తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే నా దగ్గర ఉన్న నీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వివాహిత మహిళ, మరి కొందరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ బెంగళూరులోని విదాన సౌధ పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసు పెట్టడం కలకలం రేపింది.

 ఆ రోజు నా దగ్గరకు ఎందుకు వచ్చారంటే ?

ఆ రోజు నా దగ్గరకు ఎందుకు వచ్చారంటే ?

కలబురిగికి చెందిన ఆమె, ఆమె భర్త తనకు 2009లో పరిచయం అయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ అంటున్నారు. ఆ దంపతుల భూ వివాదం పరిష్కరించాలని తన దగ్గరకు వచ్చారని, అప్పటి నుంచి ఆమె నాకు పరిచయం ఉందని, వాళ్ల బిడ్డ స్కూల్లో చేరడానికి సరైన పత్రాలు లేవని సహాయం చెయ్యమంటే తాను చేశానని, ఆ పత్రాలు ఇప్పుడు దుర్వనియోగం చేసి తానే ఆ బిడ్డకు తండ్రి అని చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆరోపిస్తున్నారు.

2018 నుంచి గొడవ చేస్తోంది

2018 నుంచి గొడవ చేస్తోంది

తనతో పరిచయం పెంచుకున్న వివాహిత మహిళ తరువాత తన దగ్గర ఆర్థిక సహాయం చేయించుకుందని, తాను అడిగినంత డబ్బులు ఇవ్వలేదని కోపంతో 2018లో తన మీద ఆరోపణలు చెయ్యడం మొదలు పెట్టిందని, ఇప్పటికే జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసిందని, తనను చంపేస్తామని ఆ లేడీ బెదిరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

    Indian Constitution మార్పు కోరుకోవడంలో తప్పేముందన్న MLA Kranthi Kiran | Oneindia Telugu
     ప్రత్యర్థులు..... ఆ లేడీ డ్రామాలు

    ప్రత్యర్థులు..... ఆ లేడీ డ్రామాలు

    తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే నా దగ్గర ఉన్న నీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వివాహిత మహిళ, మరి కొందరు, తన రాజకీయ ప్రత్యర్థులు కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందరూ కలిసి తన మద కుట్రపన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ బెంగళూరులోని విధాన సౌధ పోలీస్ స్టేషన్ లో ఆయన మీద ఆరోపణలు చేస్తున్న మహిళ మీద కేసు పెట్టారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఆ మహిళ మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె పెట్టిన కేసు విచారణలో ఉందని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+