వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంజనీర్‌పై బురద పోసిన ఎమ్మెల్యేకు... 14 రోజుల జైలు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రాలో ఇంజనీర్‌పై బురద పోసి, దాడి చేసిన ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులకు కంకావళి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కంకావళి ప్రాంతంలో నిర్మితమవుతున్న ముంబై- గోవా హైవే పై గుంతలు పడి, రోడ్డంతా బురదమయంగా మారడంతో.. రోడ్డును పరీశీలించేందుకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రానే అతని అనుచరులతో వెళ్లాడు.. ఎమ్మెల్యేతోపాటు హైవే పర్యవేక్షణణలో భాగంగా ప్రకాశ్ షెడ్కర్ అనే ఇంజనీర్ వెంట ఉన్నాడు... కాగా రోడ్డంతా గుంతలు ఉండడంతో ఎమ్మెల్యే నితేష్ సదరు ఇంజనీర్ పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు.

ఈనేపథ్యంలోనే ఇంజనీర్‌ను తన అనుచరుల ముందే నెట్టివేసి దుర్భలాషలాడాడు. ఓ వైపు ఎమ్మెల్యే ఇంజనీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు రెండు బకెట్లలో నింపిన బురద నీటిని ఇంజనీర్ పై గుమ్మరించారు..ఇక బురద నీరు పోయడమే కాకుండా ఇంజనీర్‌ను తాళ్లతో కట్టివేశారు.దీంతో ఎమ్మెల్యే చేతిలో అవమానానికి గురైన ఇంజనీర్ అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాధు చేశాడు. ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు పోలీసులు ఎమ్మెల్యేతో పాటు 16 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు.

MLA Nitesh Rane and his supporters sent to judicial custody for 14 days

అనంతరం కాగా జూలై నాలుగున అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ అనంతరం కంకావళీ కోర్టుకు తరలించారు. దీంతో విచారణ చేపట్టిన కంకావళీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది... ఇక ఇంజనీర్ పై బురద బోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అలా చేయడం తన కర్తవ్యంగా పేర్కోన్నాడు. రోడ్డు పర్యవేక్షణను ఎల్లప్పుడు చేస్తానని , ఈనేపథ్యంలోనే కర్ర పట్టుకుని అధికారులతో పని చేయించుకోవడం ఎమ్మెల్యేగా తన భాద్యత అంటూ తాను చేసిన చర్యపై స్పందించడం విశేషం.

English summary
Maharashtra, Nitesh Rane and his supporters sent to judicial custody for 14 days by Kankavali court. He and his supporters were arrested on July 4 & were sent to police custody till today, for throwing mud on an engineer in Kankavali
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X