20 మంది మంత్రుల మీద హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు, సీఎం సార్ !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల మీద చిచ్చురేపుతోంది. ఇంతకాలం కష్టపడి సంపాధించుకున్న ప్రభుత్వంలో కొందరు మంత్రులు స్థానిక ఎమ్మెల్యేతో గొడవలు పడుతున్నారని వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొందని వెలుగు చూసింది.
అధికారుల బదిలీ విషయంలో మంత్రులు మా మాటలకు సరిగా స్పందించడం లేదని శాసనసభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే 27న జరిగే సీఎల్పీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తనున్నారు. 20 మందికి పైగా మంత్రులపై 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. జులై 27న సాయంత్రం 6.30 గంటలకు శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది.

ప్రధానంగా ఆయా రంగాలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగుల బదిలీల కోసం ఎమ్మెల్యేలు చేసిన సిఫార్సులకు విలువ ఇవ్వడం లేదు. ఈ అంశాన్ని సమావేశంలో లేవనెత్తాలని కొందరు నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల్లో ప్రకటించిన హామీలలో శక్తి, అన్న భాగ్య (ఐదు కేజీల అదనపు బియ్యం బదులు 170 నగదు ఇస్తున్నారు, గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.

యువ నిధి పథకం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ హామీల అమలు వల్ల ఎమ్మెల్యేల ప్రత్యేక గ్రాంట్ కు ఈసారి కోత పడే అవకాశం ఉంది. ఇది కూడా కొందరు ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పించింది. ప్రత్యేక గ్రాంట్ ఇవ్వకుంటే క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు ఎలా చేపడతామని కూడా కొందరు ఎమ్మెల్యేలు మంత్రులను ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
శాసనసభ సమావేశాలు ఇప్పటికే ముగిశాయి. బడ్జెట్ ప్రకటనలు అమలు చేయాలి. ఆ తర్వాత బీజేపీ-జేడీఎస్ ఉమ్మడి పోరుకు ముందుకొచ్చాయి. విపక్షాల సంఘటిత పోరాటాన్ని ఐక్యంగా ఎదుర్కొనేందుకు రూపొందించాల్సిన వ్యూహం, 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఇదే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు చెప్పారు.












Click it and Unblock the Notifications