సామూహిక హత్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సుప్రీం విచారణ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్న సామూహిక హత్యలపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది. గతం సారి పిటిషన్ విచారణ చేసిన సుప్రీంకోర్టు సామూహిక హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అన్ని రాష్ట్రాలు తెలియజేయాలంటూ వారం రోజుల సమయం ఇచ్చింది.
సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందించాలంటూ సెప్టెంబర్ 13వరకు గడువు ఇచ్చింది. ఆదేశాలను స్పందించని ఆయా రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. సామూహిక హత్యల నివారణకు మంత్రులతో కమిటీ వేశామని ... దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సాధ్యసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం ఇదివరకే తెలిపింది. అయితే సామూహిక హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో 11 రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి.

పెరుగుతున్న సామూహిక హత్యలను సీరియస్‌గా పరిగణించాలని కేంద్రం ఇలాంటి ఘటనలను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు జూలై 17న సూచించింది. కేంద్రంపైనే భారం వేసి రాష్ట్రాలు తప్పించుకోవాలని చూడటం సరికాదని సుప్రీం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో తెలపాల్సిందిగా కోరింది. దీనిపై నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పించాల్సిందిగా సూచించింది. ఇదిలా ఉంటే సామూమిక హత్యలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేలా కేంద్రం త్వరలో చట్టం తీసుకురానుందని జూలైలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications