వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Model: రేప్ కేసులో 9 మంది సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్, మోడల్, నటితో పులిహోరా ?, అండర్ గ్రౌండ్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/అమెరికా/చెన్నై: ప్రముఖ మోడల్, నటి మీద అత్యాచారం చేశారని ఆరోపిస్తూ బాలీవుడ్ కు చెందిన 9 మంది ప్రముఖులు, సెటబ్రిటీల మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం కలకలం రేపింది. ఫేమస్ ఫోటోగ్రాఫర్, ప్రముఖ నటుడు, ప్రముఖ ఆడియో సంస్థకు చెందిన వ్యక్తితో పాటు మొత్తం 9 మంది మీద కేసు నమోదు చేశారు. తన మీద అత్యాచారం, లైంగిక దాడి చేసిన కామాంధులను ఇంత వరకు అరెస్టు చెయ్యలేదని లేడీ మోడల్ మండిపడుతోంది. ఒకరు విదేశాల్లో ఉండటం, కేసు నమోదు అయిన వెంటనే ఫోటోగ్రాఫర్ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవడం, కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రముఖలు కొంత మంది ఫేమస్ మోడల్ మీద అత్యాచారం, లైంగిక దాడి చేశారని వెలుగు చూడటంతో బాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
కొన్ని సంవత్సాల నుంచి పులిహోరా కలిపిన విషయం బయటకు రాలేదని వెలుగు చూసింది.

Illegal affair: మగాళ్ల బాత్ రూమ్ లో ప్రియురాలి హత్య, వాటర్ ట్యాప్ తో ఫినిష్, వెంటాడి !Illegal affair: మగాళ్ల బాత్ రూమ్ లో ప్రియురాలి హత్య, వాటర్ ట్యాప్ తో ఫినిష్, వెంటాడి !

 ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి

ప్రముఖ మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న యువతి తన మీద అత్యాచారం చేశారని కొంత మంది ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీల మీద ముంబాయిలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తన మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడ్డారని 9 మంది ప్రముఖుల మీద ఆ మోడల్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు షాక్ అయ్యారు.

 బాలీవుడ్ లో వీళ్లు ఫేమస్

బాలీవుడ్ లో వీళ్లు ఫేమస్

బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ కల్ట్సోన్ జాలియన్, టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, కవాన్ ఎంటర్ టైనమ్మెంట్ నిర్వహకుడు అనిర్బ్ బాహా, ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ, ప్రముఖ ఆడియో కంపెనీ T-seriesకు చెందిన క్రిషన్ కుమార్ తో సహా మొత్తం 9 మంది ప్రముఖుల మీద ఆ మోడల్ కేసు పెట్టింది.

 డైరెక్టుగా డీసీపీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు

డైరెక్టుగా డీసీపీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు

మే 10వ తేదీన ముంబాయి జోన్ 10 డిప్యూటీ పోలీసు కమీషనర్ (DCP) డాక్టర్ మహేశ్వర్ రెడ్డిని కలిసిన బాధితురాలు తన మీద ప్రముఖులు రేప్ చేశారని, లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. మోడల్ స్టేట్ మెంట్ రికార్డు చేసుకుని విచారణ చెయ్యాలని డీసీపీ మహేశ్వర్ రెడ్డి అంధేరి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంధేరి పోలీసులు మోడల్ స్టేట్ మెంట్ రికార్డు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.

 యవ్వారం ఎప్పుడు జరిగిందంటే ?

యవ్వారం ఎప్పుడు జరిగిందంటే ?

అంధేరి పోలీసులు మోడల్ ను విచారణ చేసి ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించారు. 2012-2019 మద్య కాలంలో బాధితురాలైన మోడల్ మీద రేప్, లైంగిక దాడి జరిగిందని అంధేరి పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మోడల్ కేసు వివరాలనును అంధేరి పోలీసులు ముంబాయి జోన్-9 పరిధిలోని బాంద్రా డీసీపీ కార్యాలాయాని పంపించారు. ఎందుకంటే యవ్వారం మొత్తం 2012 నుంచి 2019 మధ్యకాలంలో జరిగిందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

 సాక్షాలు ఇచ్చినా పట్టించుకోలేదు

సాక్షాలు ఇచ్చినా పట్టించుకోలేదు

తన మీద బాలీవుడ్ ప్రముఖలు రేప్ చేశారని, లైంగిక దాడికి పాల్పడ్డారని కేసు పెట్టి ఇన్ని రోజులు అయినా ఇంత వరకు ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదని, కొందరు పోలీసులు వాళ్లతో కుమ్మక్కు అయ్యారని, కేసు విచారణ నత్తనడకన జరుగుతోందని ఆదివారం ఆ మోడల్ స్థానిక మీడియాకు చెప్పారు. ఈ కేసులో నిందితులు హై ఫ్రోఫైల్ కు చెందిన వారు కావడంతో నే పోలీసులు వాళ్లను అరెస్టు చెయ్యకుండా కాలం గడుపుతున్నారని ప్రముఖ మోడల్ ఆరోపించారు.

మా పని మేము చేస్తున్నాము

మా పని మేము చేస్తున్నాము

మోడల్ మీద రేప్ జరిగిందని, ఆమె లైంగిక వేధింపులకు గురైయ్యిందని ఇప్పటకే 9 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కేసు విచారణ చేస్తున్న పోలీస్ ఇన్స్ పెక్టర్ సాగర్ నిఖమ్ స్థానిక మీడియాకు చెప్పారు. మేము నిష్పక్షపాతంగా కేసు విచారణ చేస్తున్నామని ఇప్పటికే ఓ మహిళా పోలీసు అధికారి ఆ మోడల్ ను పిలుచుకుని స్పాట్ కు వెళ్లి విచారణ చేసి సాక్షాలు సేకరించామని, నిందితులను అరెస్టు చెయ్యడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నామని ఇన్స్ పెక్టర్ సాగర్ నిఖమ్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.

 అండర్ గ్రౌండ్ లో, విదేశాల్లో ఉన్నారు... ఏం చెయ్యాలి ?

అండర్ గ్రౌండ్ లో, విదేశాల్లో ఉన్నారు... ఏం చెయ్యాలి ?

ప్రముఖ మోడల్ రేప్ కేసు పెట్టడంతో ఈ కేసులోని నిందితులు మాయం అయ్యారని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ కోల్ట్సన్ జూలియన్ ఇంటికి వెళ్లి చూశామని, ఆయన ఇంటికి తాళం వేసి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారని, ఆయన కారు కూడా ఇంటి దగ్గర లేదని పోలీసు అధికారులు అంటున్నారు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు జాకీ భగ్నానీ విదేశాల్లో ఉన్నాడని, ఆయన సెప్టెంబర్ లో ముంబాయి చేరుకుంటారని సమాచారం ఉందని, మిగిలిన నిందితులు కూడా ముంబాయిలో లేరని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద ప్రముఖ మోడల్, నటి రేప్ కేసు వ్యవహారం బాలీవుడ్ లో కలకలం రేపింది.

Recommended Video

Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Oneindia Telugu

English summary
Model: FIR filed against Bollywood photographer Colston Julian, Kwan Entertainment founder Anirban Blah, actor Jackky Bhagnani, Krishan Kumar of T-series. Bandra police have filed an FIR in connection with a complaint of rape and molestation filed earlier this month by a model-turned-independent artist and songwriter. They have booked nine high-profile people in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X