నేటి నుంచే ప్రధాని మోదీకంటూ కొన్ని పేజీలు.. !!

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఓ అరుదైన, చారిత్రక మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానులలో అత్యధిక రోజులు పదవిలో కొనసాగిన నేతగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ఓ నూతన అధ్యాయాన్ని మోదీ సృష్టించారు.

4,399 రోజులు..

2014 మే 26న మొదటిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు మోదీ. ఇప్పటివరకు కొనసాగుతున్నారు. వరుసగా మూడు దఫాలుగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిరాటంకంగా 4,399 రోజుల సుదీర్ఘ ప్రస్థానాన్ని నేటితో పూర్తి చేసుకున్నారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి గణనలోకి తీసుకుంటే, నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును ఆయన అధిగమించారు. తద్వారా ఆధునిక భారత రాజకీయాల్లో అత్యధిక కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నాయకుడిగా మోదీ చరిత్ర పుటల్లో నిలిచారు.

Modi Becomes India s Longest-Elected Prime Minister Surpassing Jawahar Lal Nehru Tenure in History

12 ఏళ్ల 15 రోజులు..

నెహ్రూ 1952లో ఎన్నికైన తర్వాత 4,397 రోజుల పాటు ప్రధానిగా సేవలందించారు. మోదీ జూన్ 9న తన వరుస మూడవ మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేసి, ప్రధానిగా తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నారు. 2014 మే 26న తొలిసారి పదవిని చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 12 ఏళ్ల 15 రోజుల కాలాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు.

రాజకీయ స్థిరత్వం..

ఈ సుదీర్ఘ ప్రయాణం రాజకీయ స్థిరత్వానికి, ఆయన నాయకత్వ శైలికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక వాస్తవాలను గమనిస్తే, నెహ్రూ 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన మధ్యంతర ప్రభుత్వం పగ్గాలను నిర్వహించారు.

1964 వరకు..

నెహ్రూ మొత్తం పదవీకాలం 1964 వరకు కలిపి 6,130 రోజులు ఉన్నప్పటికీ, ఎన్నికైన ప్రభుత్వ కాలపరిమితితో పోలిస్తే ఇప్పుడు మోదీ రికార్డును అధిగమించారు. నెహ్రూ దేశానికి సంస్థాగత పునాదిని, స్వాతంత్ర్యానంతర సమగ్రతను అందించగా, మోదీ ఆ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తూ 'వికసిత భారత్' నిర్మాణానికి పునాదులు వేయడమే కాకుండా, 21వ శతాబ్దంలో భారత్‌ను ప్రపంచ శక్తిగా నిలబెట్టారు.

Modi Becomes India s Longest-Elected Prime Minister Surpassing Jawahar Lal Nehru Tenure in History

మోదీ బ్రాండ్ ఇమేజ్..

దేశంలోని డజనుకు పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం మోదీ బ్రాండ్ ఇమేజ్‌కు అద్దం పడుతోంది. అస్సాం నుంచి గుజరాత్ వరకు, బెంగాల్ నుంచి రాజస్థాన్ వరకు కాషాయ జెండా రెపరెపలాడటం వెనుక బలమైన నాయకత్వం ఉంది. నెహ్రూ రికార్డును అధిగమించడం అనేది అంకెలకు మాత్రమే పరిమితం కాలేదు. దేశ రాజకీయాల్లో వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడం, ప్రజాదరణను నిలబెట్టుకోవడంలో ఆయన చూపుతున్న రాజకీయ చతురతను ఇది స్పష్టం చేస్తోంది.

సుదీర్ఘ ప్రభావం.. అసాధారణం..

దేశ రాజకీయాల్లో ఇంతటి సుదీర్ఘ ప్రభావం చూపడం అసాధారణమైన విషయమే. వికసిత భారత్ లక్ష్యంతో దేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం ఆయన ప్రధాన అజెండా. 2026 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. జర్మనీ, జపాన్‌లను అధిగమించి, అమెరికా, చైనాల తర్వాత తదుపరి స్థానానికి చేరుకోవడమే భారత ప్రభుత్వం ముందున్న అత్యున్నత లక్ష్యం.

తదుపరి లక్ష్యాలు..

ఈ ఆర్థిక వృద్ధిని సాధించడం ద్వారా ప్రపంచ వేదికపై భారత్ తన ప్రభావాన్ని మరింత విస్తరించనుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా సెమీకండక్టర్ హబ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ గవర్నెన్స్‌పై ప్రభుత్వం వేగవంతమైన వృద్ధిని కనిపిస్తోంది. 2014లో దేశంలో కేవలం కొన్ని వందల స్టార్టప్‌లు మాత్రమే ఉండగా, నేడు 2026 నాటికి వాటి సంఖ్య 2.3 లక్షలకు పైగా విస్తరించడం గమనార్హం.

45 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ..

అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే కొన్నేళ్లలో తొమ్మిది బిలియన్ డాలర్ల నుంచి 45 బిలియన్ డాలర్లకు పెంచాలని, అందులో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని మోదీ సంకల్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తదుపరి గమ్యస్థానం.

Modi Becomes India s Longest-Elected Prime Minister Surpassing Jawahar Lal Nehru Tenure in History

మౌలికం.. వేగవంతం..

అభివృద్ధి లక్ష్యంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టులు, దేశవ్యాప్త ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం, అత్యాధునిక రైల్వే స్టేషన్లు, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. దేశంలోని 146 కోట్ల జనాభాలో ఉన్న యువ శక్తిని నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా మార్చడమే మోదీ విజన్‌లోని కీలక అంశం.

విదేశాంగ విధానం..

ఇక విదేశాంగ విధానం విషయానికి వస్తే, నెహ్రూ హయాంలో 'అలీప్త విధానం' (Non-alignment) కీలకంగా ఉండగా, మోదీ పాలనలో భారత్ ప్రపంచ మిత్రుడిగా, సక్రియాత్మక భాగస్వామిగా ఎదిగింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఇప్పుడు మౌన ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా, అజెండాను నిర్దేశించే దేశంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతి స్థాపన కోసం ప్రయత్నించడం, గ్లోబల్ సౌత్ గొంతుకగా మారడం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు దీనికి నిదర్శనం.

ఆధునిక భారత్..

భారత అభివృద్ధి యాత్రను ఒక నిర్మాణంతో పోలిస్తే, పండిత నెహ్రూ సంస్థాగత పునాదిని వేస్తే, నేడు ప్రధాని మోదీ దానిపై ఆధునిక, భవ్యమైన భవనాన్ని నిర్మిస్తున్నారు. 1947 నాటి భారత్ గతి కష్టాల్లో ఉన్నప్పుడు, ఐఐటీలు, ఎయిమ్స్, ఇస్రో, భారీ పరిశ్రమల ఏర్పాటుతో నెహ్రూ ఆధునిక భారతాన్ని నిలబెట్టారు. నేడు మోదీ, ఆ పునాదులను మరింత బలోపేతం చేస్తూ 21వ శతాబ్దపు సాంకేతికతను జోడించారు.

మోదీ ముందు రాజకీయ సవాళ్లు..

మోదీ ముందు సవాళ్లు తక్కువేం లేవు. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాల సమన్వయం, ఉద్యోగ కల్పన, ప్రపంచ ఆర్థిక మందగమనం వంటివి ప్రధాన పరీక్షలు. నెహ్రూ భారతాన్ని ఏకం చేస్తే, మోదీ అఖండ, డిజిటల్ భారతాన్ని నిర్మిస్తున్నారు. మిషన్ 2047 దిశగా మోదీ నాయకత్వంలోని ఈ ప్రస్థానం భారత్‌ను ఏ స్థాయికి చేరుస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+